TS NGOs: రూట్ మార్చిన తెలంగాణ ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం ఏం చేయబోతుంది..?

గతంలో ఎన్నికల పేరుతో ప్రభుత్వ అనుకూల వ్యక్తులు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పెత్తనం చెలాయించారన్న టాక్‌ ఉంది. ప్రస్తుతం ఆ నాయకులే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేసి భంగపడుతున్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 04:43 PM IST

TS NGOs: ఉద్యోగ సంఘాల పొలికల్‌ కలర్స్‌ మారబోతున్నాయి. కలర్‌ మారకుంటే నిజంగానే రంగు పడుద్దని ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు వెళ్లాయి. గతంలో బీఆర్‌ఎస్‌ మనుషులుగా ముద్రపడ్డ యూనియన్‌ లీడర్స్‌ని కలవడానికి మంత్రులు ఇష్టపడటంలేదు. నాయకత్వాన్ని మార్చుకుంటేనే సమస్యల పరిష్కారం అన్న క్లారిటీకి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో అలజడి రేగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రాధాన్యతలు మారాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రాధాన్యతల్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, ఇతర ఎంప్లాయిస్‌ యూనియన్స్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది.

Chandrababu Naidu: యాగం.. రాజయోగం.. సీఎం కుర్చీ బాబుదేనా..? ఆ యాగం చేస్తే గ్యారంటీయా

గతంలో ఎన్నికల పేరుతో ప్రభుత్వ అనుకూల వ్యక్తులు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పెత్తనం చెలాయించారన్న టాక్‌ ఉంది. ప్రస్తుతం ఆ నాయకులే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేసి భంగపడుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది మంత్రులు ఉద్యోగ సంఘ నేతలను కలిసేందుకు ఆసక్తి చూపకపోగా.. అపాయింట్‌మెంట్ ఇచ్చిన ఒకరిద్దరు కూడా పొడిపొడిగా మాట్లాడి పంపేస్తున్నట్టు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిపోయినా.. యూనియన్‌ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒక్క సమావేశం కూడా పెట్టించలేకపోయారని, తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలేవీ ఇప్పించలేక పోయారనే అసంతృప్తి ఉద్యోగుల్లో ఉందట. అదే టైంలో గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు తెరమరుగయ్యారు. దీంతో ప్రస్తుతం యూనియన్ల బాధ్యులుగా ఉన్న కొందరు నాయకులను పదవుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి.. గతంలో కొందరు ఉద్యోగ సంఘం నాయకులు బీఆర్‌ఎస్‌ ప్రతినిధులుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

TDP IN TO NDA: పొత్తుల టైమ్.. ఎన్డీఏలోకి టీడీపీ ! ముహూర్తం ఎప్పుడంటే ?

వారితో పాటు మరికొందరు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకం అనే ప్రచారం సైతం జరుగుతోంది. దీంతో ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల మార్పు జరిగితేనే ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా ఒక సమస్యపై మంత్రులను గానీ, ముఖ్యమంత్రిని గానీ కలవడానికి ప్రస్తుత యూనియన్ నేతలకు ముఖం చెల్లడం లేదని అంటున్నారు. అలాగే కొందరు మంత్రులు.. మీరు బీఆర్ఎస్ నేతలుగా వచ్చారా? లేక యూనియన్ నేతలుగా వచ్చారా? అని అందరిలో పట్టుకుని ముఖాన్నే అడిగేస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక కొందరు నాయకులు వెనుదిరుగుతున్నారట. టీజీవోకు ఎన్నికలు జరగలేదు. నిన్న మొన్నటి వరకు అధ్యకురాలుగా వంకాయలపాటి మమత కొనసాగారు. ఇటీవల యూనియన్ సభ్యులు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పటికే అభిప్రాయ భేదాలతో ఉన్న టీజీవో నేతల మధ్య ఆ వేడి ఇంకా పెరిగిందట. వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు మంత్రులను కలుస్తున్నారు. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాంతో కూడా టీజీవోలు రహస్య సమావేశం నిర్వహించారు.

ఆయన సలహాలు, సూచనల మేరకు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, మరో రెండు జిల్లాల టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులను వెంటనే తొలగించాలని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే వారు వైదొలగి ఇతరులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మరికొన్ని జిల్లా యూనిట్లు, మండలాల భాద్యులను కూడా తప్పుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొత్త నాయకత్వం శ్రద్ద వహిస్తుందా? లేక పాత నాయకుల మాదిరిగానే మళ్ళీ రాజకీయ పార్టీల నేతలుగా మారుతారా అనేది చూడాలంటున్నారు ఉద్యోగులు.