CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఏరియాకి వెళితే అక్కడున్న దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నారు. ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తానంటూ రీసెంట్ గా భువనగిరిలో స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్. రెండు లక్షల రుణమాఫీపై BRS, BJP లాంటి విపక్షాలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ECI SHOCK TO JAGAN: అందుకే తప్పించారా ? ఆ ఇద్దర్ని అందుకే తప్పించారా ?
ఆగస్ట్ 15 లోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన వెళ్ళిన చోటల్లా ఆ ఏరియాలో ఉన్న దేవుడిపై ఒట్టేసి చెబుతున్నా.. అనడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బాసర సరస్వతి, ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి, యాదాద్రి నరసింహస్వామి, భద్రాచలం రామయ్య, సేవాలాల్ సాక్షిగా ఇలా రేవంత్ తెలంగాణలో దాదాపు అన్ని ప్రధాన దేవుళ్ళనూ కవర్ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం ఇలా ఏ లోక్ సభ నియోజకవర్గం ప్రచారానికి వెళ్ళినా ప్రామిస్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు అంతమంది దేవుళ్ళ మీద ఒట్టు మీద ఒట్టు పెడుతున్నారన్నది అర్థం కాని ప్రశ్న.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదని, అందుకే రేవంత్ ఒట్టేసి చెబుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేయకపోతే రిజైన్ చేయాలని BRS సవాల్ చేసింది. అయితే రేవంత్ తాను అమలు చేసి తీరుతాననీ.. అమలైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని సవాల్ చేశారు. రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు.. కరువును సరిగా ఎదుర్కోవడం లేదు లాంటి ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విపక్షాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. జనంలో నమ్మకం కల్పించేందుకు రేవంత్ దేవుళ్ళ ఒట్టు పెడుతున్నట్టు అర్థమవుతోంది.