బ్రేకింగ్: ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇంజనీరింగ్ కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల నుండి లక్షల మంది పట్టాలు పొందుతున్నారు, కానీ వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదు అని మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - September 25, 2024 / 04:03 PM IST

ఇంజనీరింగ్ కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల నుండి లక్షల మంది పట్టాలు పొందుతున్నారు, కానీ వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదు అని మండిపడ్డారు. దీనికి కారణం అక్కడ సరైన బోధన లేకపోవడమే అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు హెచ్చరిస్తున్న ఇలానే కొనసాగితే అనుమతులు రద్దు చేస్తాం అని హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ పోటీ ప్రపంచంతో ఆంధ్రప్రదేశ్ , చెన్నై, బెంగళూరుతో కాదన్నారు.

స్టాన్ ఫోర్డ్ , ఆక్స్ పర్డ్ ఆఫ్ క్యాంపస్ లను ఇక్కడ పెట్టాలనే ప్రయత్నం లో ఉన్నామని తెలిపారు. తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందన్న ముఖ్యమంత్రి గత పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామన్నారు సిఎం. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 35 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసామని వివరించారు.