మెట్రో రెండో దశ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. కారిడార్ 4 లో భాగంగా నాగోల్ – ఎయిర్ పోర్టు వరకు మొత్తం 36.6 కి.మీ మెట్రో పూర్తి చేస్తారు. ఆ తర్వాత కారిడార్ 5 లో భాగంగా రాయదుర్గ్ – కోకాపేట్ నియోపోలిస్ వరకు మొత్తం 11.6 కి.మీ వరకు నిర్మాణం చేపడుతుంది ఎల్ అండ్ టీ. కారిడార్ 6లో భాగంగా ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట వరకు మొత్తం 7.5 కి.మీ నిర్మాణం చేపడతారు.
కారిడార్ 7లో భాగంగా మియాపూర్ – పటాన్చెరు వరకు 13.4 కి.మీ నిర్మాణం ఉంటుంది. కారిడార్ 8లో ఎల్బీ నగర్ – హయత్ నగర్ వరకు7.1 కి.మీ నిర్మాణం పూర్తి చేస్తారు. కారిడార్ 9లో భాగంగా ఎయిర్ పోర్టు – ఫోర్త్ సిటీ వరకు 40 కి.మీ. నిర్మాణం చేపడతారు. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు అంచనా రూ8,000 కోట్లు.