రూ.111 కోట్ల 81 లక్షల 71 వేల 245@సైబరాబాద్ కమీషనరేట్ చలాన్ రికవరీ

సైబరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న కేసులపై కమిషనర్ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ కంప్లైంట్ వచ్చిన కేసు నమోదు చేస్తామన్నారు. 37 వేల 600 కేసులు నమోదు చేశామని... సైబరాబాద్ లో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయన్నారు. 32 శాతం సైబర్ కేసులో ఉన్నాయని తెలిపారు.

  • Written By:
  • Publish Date - December 24, 2024 / 02:58 PM IST

సైబరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న కేసులపై కమిషనర్ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ కంప్లైంట్ వచ్చిన కేసు నమోదు చేస్తామన్నారు. 37 వేల 600 కేసులు నమోదు చేశామని… సైబరాబాద్ లో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయన్నారు. 32 శాతం సైబర్ కేసులో ఉన్నాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 11914 గాను 70కోట్ల అమౌంట్ రిఫండ్ అయ్యిందని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్ కూడా బాగా పెరిగిందని ప్రాపర్టీ కేసుల్లో 4681.. రోడ్డు ప్రమాదాలు 3024.. ఎకనామిక్ కేసులు 2140… ట్రెస్ పాస్ కేసులు 1429 నమోదు అయ్యాయి అని తెలిపారు.

ఎన్డీపీఎస్ యాక్ట్ 421 కేసుల్లో 24కోట్ల 92లక్షల విలువ చేసే మత్తుపదార్ధాలు స్వాదీనం చేసుకున్నామని వివరించారు. ఈ కేసుల్లో 954 మందిని అరెస్ట్ చేసామని తెలిపారు. 805 రోడ్డుప్రమాదాలలో 842 మంది మృతి చెందారని చాలన్స్ లో రికార్డ్ బద్దలు కొట్టామని వివరించారు. సైబరాబాద్ కమిషనరేట్ 111 కోట్ల 81 లక్షల 71 వేల 245 రూపాయలు వసూలు చేసామని Eow 90 కేసులో 5కోట్ల, 29లక్షల అటాచ్ చేసామని తెలిపారు.

షీ టీం 541 కేసులు నమోదు చేసినట్టు ఆయన వివరించారు. సైబర్ క్రైమ్ లో లక్ష లోపు వరకు లోకల్ పిఎస్ లో ఇక జనవరి నుండి ఫిర్యాదు ఇవ్వొచ్చని తెలిపారు. లక్ష దాటితేనే సైబర్ క్రైమ్ పిఎస్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బీఎన్ఎస్ కేసులో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాజేంద్ర నగర్ లో నమోదు అయ్యింది టోటల్ 14వేల 250 కేసులు అయ్యాయని పేర్కొన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు.