దిగ్విజయంగా సమగ్ర కుటుంబ సర్వే, బీఆర్ఎస్, బీజేపీల్లో మొదలైన వణకు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబసర్వేను నియహించింది. కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయి. సర్వే కోసం 87 వేల 900 ఎన్యుమరెటర్లు పని చేశారు.

  • Written By:
  • Publish Date - December 2, 2024 / 03:57 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబసర్వేను నియహించింది. కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయి. సర్వే కోసం 87 వేల 900 ఎన్యుమరెటర్లు పని చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉంటే..19 వేల మంది ఎన్యుమరేటర్లు నియమించింది. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్ లో న్యాయం జరిగేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. కొందరు ఈ సర్వే ను రాజకీయం చేయడంపై బీసీ సంక్షేహ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో సర్వే సక్సెస్ అయింది. అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేసింది. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి పత్రాలు కానీ.. జిరాక్సులు కానీ తీసుకోకుండా సర్వే పూర్తి చేశారు.

రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ? వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా ? లేదా ? విద్య, రాజకీయాల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఎలా ఉంది ? భవిష్యత్ లో అందించాల్సిన సాయం ఏంటి ? రాజకీయాల్లో ఏ వర్గానికి అన్యాయం జరుగుతోంది ? వంటి అంశాలను సమగ్రంగా…కులాల వారీగా సర్వే చేపట్టింది తెలంగాణ సర్కార్. గత ప్రభుత్వాలు కులగణనను పట్టించుకోకపోవడంతో…బీసీలకు అన్నింట్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది. బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్…పట్టుబట్టి సమగ్ర కుటుంబసర్వేకు పట్టుబట్డడంతో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ సర్వే ద్వారా ఏ సామాజికవర్గం జనాభా ఎంతుంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తేలిపోనుంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సామాజిక వర్గాలకు సరైన న్యాయం జరగలేదు. దగాపడ్డ వర్గాలకు కాంగ్రెస్ హయాంలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంది. సమగ్ర కుటుంబసర్వేను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో బీఆర్ఎస్, బీజేపీలకు భయం మొదలైంది. ఈ రెండు పార్టీ సర్వేను వ్యతిరేకిస్తున్నాయి. సమగ్ర సర్వేలో బీసీల జనాభా తేలితే…వారి జానాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఆ వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. వారంతా హస్తం పార్టీకి దగ్గరవనున్నాయి. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

సమగ్ర కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ మోడల్ ని దేశం మొత్తం ఫాలో అయ్యేలా జరుగుతోంది. సమగ్ర ఇంటి సర్వే 92.6% పూర్తయింది. 13 జిల్లాలో 100% పూర్తి అయితే…1.08 కోట్ల ఇళ్లలో సర్వే కంప్లీట్ అయింది. సర్వేలో డేటా ఎంట్రీ కీలకం కావడంతో… ఎప్పటికపుడు సర్వే వివరాలతో డిజిటలైజేషన్ షురూ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 49 లక్షల 79 వేల 473 ఇళ్లకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తి అయ్యింది. ములుగు జిల్లాకు సంబంధించి అత్యధికంగా 92 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. తర్వాత ప్లేస్‌లో యాదాద్రి జిల్లా, సిద్ధిపేట్, మహబూబ్‌నగర్ జిల్లాలు వున్నాయి. రెండు జిల్లాల్లో 70శాతం, నాలుగు జిల్లాల్లో 60శాతం, 11 జిల్లాల్లో 50శాతానికి పైగా కంప్యూటరీకరణ పూర్తి అయ్యింది.