CONGRESS ALERT: ఆ మూడు రోజులు జాగ్రత్త.. కేడర్‌ని అలెర్ట్ చేసిన కాంగ్రెస్..

తెలంగాణలో కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందనీ.. 70 నుంచి 80 సీట్లల్లో పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములపై ఈ టీమ్ మంత్లీ, వీక్లీ వైజ్‌గా రిపోర్టులను ఇప్పటికే తెలంగాణ పీసీసీతోపాటు అధిష్టానానికి పంపుతోంది.

  • Written By:
  • Publish Date - November 27, 2023 / 03:40 PM IST

CONGRESS ALERT: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగిసిన తర్వాత నుంచి పోలింగ్ తేదీకి మధ్య ఉన్న రెండు రోజులపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్. బీఆర్ఎస్ పకడ్బందీగా పోల్ మేనేజ్‌మెంట్ చేసి చివరి నిమిషంలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ప్లాన్ చేస్తోందనే ప్రచారం ఉంది. దానికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ లీడర్లకు పోలీసులు, అధికారులు సహకారం అందించే అవకాశం ఉందనీ.. అప్రమత్తంగా ఉండాలని సునీల్ కనుగోలు టీమ్ కాంగ్రెస్ అభ్యర్థులను హెచ్చరిస్తోంది.

KISHAN REDDY: బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయి: కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందనీ.. 70 నుంచి 80 సీట్లల్లో పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములపై ఈ టీమ్ మంత్లీ, వీక్లీ వైజ్‌గా రిపోర్టులను ఇప్పటికే తెలంగాణ పీసీసీతోపాటు అధిష్టానానికి పంపుతోంది. ఈ టీమ్ డైరెక్ట్‌గా బెంగళూరు నుంచే లీడ్ చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రాబోయే మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చివరి 3 రోజుల్లో ఎలా ఉండాలి.. బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలి వంటి అంశాలపై కాంగ్రెస్ అభ్యర్థులకు సునీల్ టీమ్ బెంగళూరు నుంచే సలహాలు, సూచనలు ఇస్తోంది. పథకాల ఫెయిల్యూర్, ప్రభుత్వంపై అసంతృప్తి, స్థానిక సమస్యలను హైలెట్ చేయాలని ఎప్పటికప్పుడు అభ్యర్థులకు సూచిస్తూ వచ్చింది. అలాగే గెలుస్తామన్న ధీమాతో జనాన్ని నిర్లక్ష్యం చేయొద్దని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఆ సూచనల మేరకు అభ్యర్థులు తమ ప్రచారంలో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.

ఇక తెలంగాణలో పోలింగ్ డేట్‌కి మూడు రోజులే టైమ్ ఉంది. ఈ మూడు రోజుల టైమ్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి.. బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో సునీల్ కనుగోలు టీమ్ ట్రైనింగ్ ఇస్తోంది. “ఈ సైలెన్స్ పీరియడ్‌‌లో అభ్యర్థులు సొంతంగా పనిచేసుకుంటూనే.. బీఆర్ఎస్ కదలికలపైనా కన్నేసి ఉంచాలి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దానికి తగ్గట్టుగా కౌంటర్ ప్లాన్ వేసుకోవాలి. మీ టీమ్స్‌ని అప్రమత్తంగా ఉంచుకోండి” అని కాంగ్రెస్ అభ్యర్థులకు చెబుతున్నారు. టఫ్ ఫైట్ ఉన్న 25 నుంచి 30 స్థానాలపై సునీల్ కనుగోలు టీమ్ డైరెక్ట్‌గా నజర్ పెట్టింది. లోకల్ లీడర్లను డీల్ చేస్తూ వ్యూహాలు రెడీ చేస్తోంది. బీఆర్ఎస్‌కి ప్లస్ పాయింట్.. పోల్ మేనేజ్‌మెంటే కావడంతో.. కాంగ్రెస్ కూడా పక్కాగా దానిపైనే దృష్టిపెట్టింది. ప్రతి ఒక్క ఓటర్నీ పోలింగ్ కేంద్రానికి రప్పించేలా హస్తం పార్టీ కూడా ప్లాన్ చేస్తోంది. గెలుస్తామనే అతి విశ్వాసంతో ఉండొద్దనీ.. చివరి వరకూ.. ఓటర్లను కలుసుకోవాలని హైదరాబాద్, బెంగళూరు స్థాయిలో అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు.