Mamidala Yashaswini Reddy: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాదు.. రాజకీయ ఉద్ధండుడిగా పేరు ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మీద పాలకుర్తిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. నిజానికి యశస్వినికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె అత్త ఝాన్సీ రెడ్డి.. ఎర్రబెల్లి మీద పోటీ చేయాలనుకున్నారు. ఐతే ఆమె పౌరసత్వం విషయంలో సమస్య రావడంతో.. చివరి నిమిషంలో యశస్విని బరిలో దిగాల్సి వచ్చింది.
TAPPING CASE : ఇజ్రాయెల్ పరికరాలతో ట్యాపింగ్.. 500 కోట్లకు పైగా వసూల్
అత్త వ్యూహాలతో.. కోడలు అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. ఆస్తులు అమ్మి మరీ.. పాలకుర్తి అభివృద్ధికి సిద్ధం అయ్యారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు యశస్విని రెడ్డి అత్తపై పాలకుర్తి నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. గాంధీ భవన్‌లో పాలకుర్తి లొల్లి పీక్స్‌కు చేరింది. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి తీరుకి వ్యతిరేకంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నిరసనకు దిగారు. దేవరుప్పుల మoడల పార్టీ అధ్యక్షుడు తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. పేరుకే యశిస్విని రెడ్డి ఎమ్మెల్యే అయినా.. పెత్తనం మాత్రం అత్త ఝాన్సీ రెడ్డి చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. వేరే పార్టీల నుంచి కాంగ్రెస్‌లో జాయిన్ అయిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
దేశ పౌరసత్వం లేకపోయినా.. పార్టీలో ఎలాంటి పదవి లేకున్నా.. ఝాన్సీ రెడ్డి పార్టీ శ్రేణులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ అనుచరులను పక్కన బెట్టుకొని సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా ఝాన్సీ రెడ్డి వ్యవహారం ఉందని పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు.