CONGRESS: కంటోన్మెంట్ బరిలో కాంగ్రెస్.. ఉప ఎన్నిక ఏకగ్రీవం కానట్లే..

సాధారణంగా ఎవరైనా పదవిలో ఉండగా మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులు ఉప ఎన్నికలో పోటీ చేస్తారు. ఇలాంటప్పుడు ఇతర పార్టీలు పోటీలో ఉండవు. సిట్టింగ్ పార్టీకే వదిలేసి, ఎన్నిక ఏకగ్రీవం చేస్తాయి. ఈ సంప్రదాయం ప్రకారం.. ఇక్కడ బీఆర్ఎస్‌కే సీటు వదిలేయాలి.

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 09:21 PM IST

CONGRESS: సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతోపాటే ఇక్కడ కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఎన్నిక జరగనుంది. అయితే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోపాటు, కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీ చేయబోతున్నాయి. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్‌ పార్టీది. ఆ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఆమె సోదరి ఇక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి.

MLC KAVITHA: భార్య కోసం అనిల్‌ పోరాటం.. కవిత అనిల్‌ లవ్‌స్టోరికి ఫిదా అవ్వాల్సిందే..

సాధారణంగా ఎవరైనా పదవిలో ఉండగా మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులు ఉప ఎన్నికలో పోటీ చేస్తారు. ఇలాంటప్పుడు ఇతర పార్టీలు పోటీలో ఉండవు. సిట్టింగ్ పార్టీకే వదిలేసి, ఎన్నిక ఏకగ్రీవం చేస్తాయి. ఈ సంప్రదాయం ప్రకారం.. ఇక్కడ బీఆర్ఎస్‌కే సీటు వదిలేయాలి. కానీ, ఈసారి పార్టీలు అలా చేయడం లేదు. కారణం.. పార్లమెంట్ ఎన్నికలు. ఉప ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటమే దీనికి కారణం. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని పోటీకి నిలబెట్టకపోతే.. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపైనా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. పోటీలో లేకుంటే.. కంటోన్మెంట్‌లో గంపగుత్తగా బీఆర్ఎస్‌కే ఓట్లు పడొచ్చు. దీంతో పార్లమెంట్ అభ్యర్థికి తీవ్ర నష్టం కలుగుతుంది. అందువల్ల తమ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణే‌శ్‌ను తిరిగి ఇక్కడినుంచి పోటీ చేయించాలని బీజేపీ భావించింది. కానీ, ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు. దీంతో బీజేపీ.. మరో అభ్యర్థి కోసం వెతుకుతోంది.

ఎమ్మెల్యే సీటు విషయంలో కాంగ్రెస్ కచ్చితమైన హామీ ఇవ్వడం వల్లే శ్రీ గణేశ్ కాంగ్రెస్‌లో చేరారని సమాచారం. గతంలో కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ నుంచి ప్రజా గాయకుడు గద్దర్ కూతురు.. వెన్నెల పోటీ చేశారు. కానీ, ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో కాంగ్రెస్.. రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేశ్‌ను చేర్చుకుంది. ఇక.. బీఆర్ఎస్ తరఫున లాస్య నందిత సోదరి నివేదిత టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.