CONGRESS COUNCIL: కౌన్సిల్‌లో కాంగ్రెస్ సర్కార్‌కి కష్టాలే..! బిల్లులు ఆమోదం పొందేది ఎలా..?

తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో 30 మంది బీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు ముగ్గురు, MIMకి ఇద్దరు, బీజేపీకి ఒకరు, స్వతంత్ర్యులు ఇద్దరు.. గవర్నర్ కోటాలో మరో ఇద్దరు ఉంటారు. గవర్నర్ కోటాలో ఇద్దరు సభ్యుల భర్తీ కాలేదు.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 04:12 PM IST

CONGRESS COUNCIL: తెలంగాణ అసెంబ్లీలో క్లియర్ మెజారిటీతో అధికారం చేపడుతోంది కాంగ్రెస్ పార్టీ. మెజారిటీ ఉండటంతో.. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా ఇబ్బంది అక్కర్లేదు. కానీ శాసనమండలిలో ప్రభుత్వానికి కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ముగ్గురు మాత్రమే సభ్యులు ఉన్నారు. వీళ్ళల్లో ఒకరు అసెంబ్లీకి ఎన్నిక అవడంతో.. ఇద్దరే మిగులుతారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బిల్లులు ఆమోదం పొందాలంటే ఎలా..? తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి.

KCR houses : కేసీఆర్ ఆ ఇల్లూ ఖాళీ చేయాల్సిందే..!

వీటిల్లో 30 మంది బీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు ముగ్గురు, MIMకి ఇద్దరు, బీజేపీకి ఒకరు, స్వతంత్ర్యులు ఇద్దరు.. గవర్నర్ కోటాలో మరో ఇద్దరు ఉంటారు. గవర్నర్ కోటాలో ఇద్దరు సభ్యుల భర్తీ కాలేదు. BRS ప్రభుత్వం రికమండ్ చేసిన ఇద్దరిని గవర్నర్ ఆమోదించలేదు. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరిని కాంగ్రెస్ ప్రభుత్వం రికమండ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న ముగ్గురు సభ్యుల్లో ఒకరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి. ఇంకొకరు కసిరెడ్డి నారాయణ రెడ్డి.. కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన రాజీనామా చేస్తే శాసన మండలిలో రెండుకు తగ్గనుంది కాంగ్రెస్ బలం. 2025 మార్చి దాకా ఏ కోటాలోనూ రిటైర్డ్ అయ్యే సభ్యులు లేరు. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ సహా అందరూ బీఆర్ఎస్ పార్టీకి చెందినవాళ్ళే.

దాంతో అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు, ఇతర తీర్మానాలు మండలిలో నెగ్గాలంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం గులాబీ పార్టీపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అయితే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు శాసన మండలిలో ఆ ప్రభుత్వానికి కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. దాంతో కాంగ్రెస్, టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు కేసీఆర్. అప్పుడు అసెంబ్లీలో పాసైన బిల్లులు, మండలిలోనూ ఆమోదం పొందాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వ్యూహం ఫాలో అవుతుందా..? బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను లాక్కుంటుందా.. అన్న దానిపై చర్చ నడుస్తోంది.