Revanth Reddy: రేవంత్‌కు కాంగ్రెస్ ఫుల్ పవర్స్ ఇచ్చిందా..? కాంగ్రెస్ దూకుడు తట్టుకోవడం కష్టమేనా..?

బీజేపీపై పోరులో అసలు కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోని పార్టీలు కూడా కలిసి నడుద్దాం అని ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ ముందు ఆఫర్లు పెడుతున్నాయి. మిగతా చోట్ల కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం కొత్త జోష్ కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 09:41 AM IST

Revanth Reddy: కర్ణాటక ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత అన్నట్లు తయారయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ అనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే సీన్. కర్ణాటక విజయం నింపిన జోష్ అంతా ఇంతా కాదు. మూడు అలకలు.. ఆరు పంచాయితీలు అన్నట్లు సాగే కాంగ్రెస్‌ను.. ఈ ఒక్క విజయం అంతా సెట్ రైట్ చేసింది.

బీజేపీపై పోరులో అసలు కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోని పార్టీలు కూడా కలిసి నడుద్దాం అని ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ ముందు ఆఫర్లు పెడుతున్నాయి. మిగతా చోట్ల కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం కొత్త జోష్ కనిపిస్తోంది. కర్ణాకట విజయం ముందు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు యుద్ధం కనిపించేది. కట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ భయపెడుతోందిప్పుడు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం కూడా లేదు. దీంతో రాజకీయ హడావుడి మొదలైంది. పార్టీలన్నీ పెద్ద ఎత్తున ముందస్తు ఏర్పాట్లలో మునిగి పోయాయి. కర్ణాటక ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నాయకులు ధీమాతో కనిపిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ నాయకత్వం కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్పకుండా భారీ విజయాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అందుకే పార్టీ సీట్ల ఎంపిక విషయంలో ఇప్పటికే రేవంత్ రెడ్డికి పార్టీ అధినాయకత్వం కీలక ఆదేశాలు ఇచ్చిందని తెలుస్తోంది. 10, 15 మంది సీనియర్‌ల విషయంలో మినహా ఇతర స్థానాల్లో రేవంత్‌ రెడ్డికి పూర్తి బాధ్యతను అప్పగించారంటూ ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహించారు. ఆ ఫలితాల ఆధారంగా ఆశావాహులకు సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవడం కోసం రేవంత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ అధినాయకత్వం నుంచి రేవంత్ కీలక పవర్‌ తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీపై గెలిచేది మేమే అంటూ తీవ్రంగా ప్రతిఘటించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

ఇలాంటి సమయంలో బీజేపీ వ్యూహం ఏంటి అనేది చూడాలి. రాష్ట్ర నాయకత్వంలో మార్పు తీసుకు రావడం వల్ల పార్టీని గెలిపించుకోవాలని భావిస్తున్నారట. అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.