T Congress: గెలుపుపై ఫుల్‌ ధీమాతో ఉన్న కాంగ్రెస్‌..! హస్తం పార్టీ నమ్మకం వెనక సీక్రెట్ ఇదేనా?

హస్తం నేతలు గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పార్టీ బలహీనంగా స్థానాలపై ఫోకస్‌ పెట్టడం టైమ్ వేస్ట్ అని.. ఆ సమయాన్ని కూడా గెలిచే స్థానాలపై పెడితే.. విజం మరింత దగ్గరవుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆలోచన చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 06:42 PM IST

ఇంకొన్ని రోజులు అంతే.. తెలంగాణలో మహా రాజకీయ యుద్ధం జరగబోతోంది. పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధంచేస్తున్నాయ్. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్‌.. అధికారం కోసం కాంగ్రెస్‌, బీజేపీ.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఐతే కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్‌ మీద కనిపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌.. సూపర్ జోష్‌లో కనిపిస్తోంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో అన్నీ విషయాల్లోనూ పక్కా ప్రణాళికతో వ్యూహాలను రచిస్తున్నారు హస్తం నేతలు. ఇప్పటికే పార్టీలోని అంతర్గత విభేదాలకు దాదాపు చెక్ పెట్టిన హైకమాండ్…. ఇక నేతలను సమన్వయ పరిచే పనిలో నిమగ్నమైంది.

అంతే కాకుండా అభ్యర్థుల ఎంపికపై కూడా తుది కసరత్తులు జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. హస్తం పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఇచ్చిన సర్వే ఆధారంగా అభ్యర్థులను జల్లెడ జల్లెడ పడుతోంది స్టీరింగ్ కమిటీ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంకొన్ని రోజుల్లో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావంపై సునిల్ కనుగోలు.. ఇప్పటికే స్పష్టమైన సర్వేను పార్టీ నేతల ముందు ఉంచారట. ఆ సర్వే ప్రకారం 41 నియోజకవర్గాల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఉన్నాయట. మరో 40 స్థానాల్లోని 30సీట్లలో కాంగ్రెస్‌కు సానుకూలంగానే ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారట. గెలిచే స్థానాలపై గట్టిగా ఫోకస్ చేసి నేతలను కోఆర్డినేట్ చూస్తే.. ఓటు బ్యాంకు చీలకుండా చూస్తే గెలుపు కాంగ్రెస్‌దే అని సునీల్‌ కనుగోలు ఇచ్చిన సర్వేలో తేలిందట. అందుకే హస్తం నేతలు గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పార్టీ బలహీనంగా స్థానాలపై ఫోకస్‌ పెట్టడం టైమ్ వేస్ట్ అని.. ఆ సమయాన్ని కూడా గెలిచే స్థానాలపై పెడితే.. విజం మరింత దగ్గరవుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆలోచన చేస్తున్నారు. అందుకో మొత్తం 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించినా.. అందులో 80స్థానాలపైనే దృష్టి పెట్టేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోందని టాక్.