Addanki Dayakar: ఆ ఇద్దరే కారణమా..? అద్దంకి దయాకర్‌కి దెబ్బ వేసింది ఆ ఇద్దరేనా..?

నిజానికి ఒక ఎమ్మెల్సీ సీటు అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని పార్టీ అభిప్రాయానికి వచ్చింది. ఐతే ఆఖరి నిమిషంలో అద్దంకి పేరు జాబితాలో లేకుండా పోయింది. దీంతో అసలు ఏం జరిగిందని చర్చ విస్తృతంగా జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 06:02 PM IST

Addanki Dayakar: అద్దంకిని అడ్డుకున్నది ఎవరు..? జిల్లా రాజకీయాలు ఆయనను ఇబ్బందికి గురి చేస్తున్నాయా..? ఈ పదవి పోయిందంటే పెద్ద పదవి వస్తుందని ఆయన చెప్పడం వెనక వ్యూహం ఏంటి..? ఇంతకీ అద్దంకికి అడ్డంకి ఎవరు..? అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరు వెంకట్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఐతే నిజానికి ఒక ఎమ్మెల్సీ సీటు అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని పార్టీ అభిప్రాయానికి వచ్చింది. ఐతే ఆఖరి నిమిషంలో అద్దంకి పేరు జాబితాలో లేకుండా పోయింది. దీంతో అసలు ఏం జరిగిందని చర్చ విస్తృతంగా జరుగుతోంది. నల్గొండ జిల్లాకు సంబంధించిన జిల్లా అంతర్గత పంచాయితీలు ఆయనకు కొంత అడ్డంకిగా మారాయనేది టాక్.

NANDAMURI BALAKRISHNA: ఇదీ అసలు సంగతి! బాలయ్య తిట్టింది ఎన్టీఆర్‌ను కాదట..

దీంతోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ గౌడ్‌కు.. ఎన్నికల్లో టికెట్ నిరాకరించించారు. అప్పట్లోనే ఆయనకు పార్టీ హామీ ఇచ్చింది. మొదటి విడతలోనే ఎమ్మెల్సీని చేస్తామని భరోసా కల్పించంది. అధిష్టానం ఇచ్చిన హామీ కాదని.. ముందుకు వెళ్తే క్యాడర్‌కి తప్పుడు సంకేతం వెళ్తుంది అనే భావన కూడా పార్టీ నాయకత్వంలో వచ్చింది. దీనికితోడు మహేష్ గౌడ్ కూడా సీరియస్‌గానే అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షి మొత్తం వ్యవహారంలో కీలకంగా మారారు. మహేష్ గౌడ్‌కి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు సమాచారం చేరవేశారు. పార్టీ క్యాడర్‌కి తప్పుడు సంకేతం వెళ్లకుండా.. కాన్ఫిడెన్స్‌ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ కీలక నేతలకు దీపాదాస్ మున్షి నచ్చచెప్పారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయ్. ఇంతలో అద్దంకి దయాకర్‌కి కూడా కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి నచ్చజెప్పారు. దీపా దాస్ మున్షి కూడా.. అద్దంకి దయాకర్‌కి విషయాన్ని చేరవేశారు. పార్టీ కచ్చితంగా మంచి అవకాశం ఇస్తుందని భరోసా ఇచ్చారు.

Pawan Kalyan : పవన్‌కు కన్నీళ్ళు తెప్పించాడు.. ఐర్లాండ్ నుంచి ఓడ కళాసి లెటర్

దీంతో ఇప్పుడు అద్దంకి దయాకర్‌కి పార్టీలో ఏం అవకాశం కల్పిస్తారనేది అసలు చర్చ. నిజానికి ఇప్పట్లో ఎమ్మెల్సీ సీట్లు లేవు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయ్. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి బరిలో దించాలనే ఆలోచన ఏఐసీసీకి ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకి ఇదే హామీ ఇచ్చారని ప్రచారం. లేదంటే పార్టీలో కీలక పదవి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి మరో కారణం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాలలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కింది. తమకు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే భావనలోకి మాదిగ సామాజికవర్గం వెళ్తుందనేచర్చ కూడా పార్టీలో జరుగుతోంది. మొత్తానికి అద్దంకి దయాకర్‌కి ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడానికి అనేక కారణాలు అడ్డంకిగా మారాయి అనేది ఓపెన్ టాక్. కాంగ్రెస్ నాయకత్వం అద్దంకిని ఎలా సెటిల్ చేస్తుంది అనేది చూడాలి. దయాకర్ మాత్రం పార్టీకి ఎంతో విధేయతతో.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వీడియో విడుదల చేశారు.

అద్దంకి దయాకర్ పూర్తిగా రేవంత్ రెడ్డి మనిషిగా ముద్రపడ్డారు. జిల్లాలో కీలక నేతలైన ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వీళ్లు ముగ్గురు అద్దంకి దయాకర్‌కి వ్యతిరేకం. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి.. రేవంత్‌తో గొడవ పడినప్పుడు.. అద్దంకి దయాకర్ వీళ్లిద్దరిని తిట్టిన తిట్లు.. జిల్లా జనం మర్చిపోలేదు. ఆరోజు రేవంత్‌ని ప్రొటెక్ట్ చేయడానికి అద్దంకి దయాకర్ నోరు పారేసుకోవడమే పొరపాటు అయింది. అందువల్లే.. చివరి నిమిషంలో దయాకర్‌కు ఎమ్మెల్సీ రాకుండా.. మొత్తం కోమటిరెడ్డి తెర వెనక చక్రం తిప్పారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.