Vijayashanthi: ఇప్పుడైనా సరిగ్గా ఉండండి.. బీఆర్ఎస్‌కు రాములమ్మ కౌంటర్‌..

ప్రతిపక్షాలు కావొచ్చు, మీడియా కావొచ్చు.. కేసీఆర్ వాళ్లతో మాట్లాడే విధానమే వేరేగా ఉంటుంది. చాలా సింపుల్‌గా తీసిపడేసినట్టు మాట్లాడేస్తుంటారు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలనైతే ఓ ఆట ఆడుకుంటారు. కానీ ఇప్పుడు ఆయనే ప్రతిపక్షంలో వచ్చి కూర్చున్నారు.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 04:46 PM IST

Vijayashanthi: ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. తిరుగులేదు అనుకున్న కారు పార్టీ నుంచి అధికారాన్ని లాగేసి హస్తానికి అందించారు తెలంగాణ ప్రజలు. మొన్నటి వరకూ అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్‌ ఇప్పుడు ప్రతిపక్షానికి వెళ్లిపోయింది. దీంతో బీఆర్‌ఎస్‌కు బుద్ధి నేర్పించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్‌ నేత విజయశాంతి. బీఆర్ఎస్‌ నేతలు ఇప్పుడైనా హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవలంటూ ట్వీట్‌ చేశారు. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీతో బీఆర్ఎస్‌ హుందాగా ప్రవర్తించాలంటూ చెప్పారు.

CONGRESS COUNCIL: కౌన్సిల్‌లో కాంగ్రెస్ సర్కార్‌కి కష్టాలే..! బిల్లులు ఆమోదం పొందేది ఎలా..?

“ప్రతిపక్షాలు కావొచ్చు, మీడియా కావొచ్చు.. కేసీఆర్ వాళ్లతో మాట్లాడే విధానమే వేరేగా ఉంటుంది. చాలా సింపుల్‌గా తీసిపడేసినట్టు మాట్లాడేస్తుంటారు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలనైతే ఓ ఆట ఆడుకుంటారు. కానీ ఇప్పుడు ఆయనే ప్రతిపక్షంలో వచ్చి కూర్చున్నారు. దీంతో ఇక నుంచి అలా మాట్లాడటం మానేస్తే బెటర్‌” అని రాములమ్మ సజెషన్‌ ఇచ్చారు. కేవలం విజయశాంతి మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలతో కూడా కేసీఆర్‌ వ్యవహరించే తీరుపై చాలా కాలం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. సొంత పార్టీ నేతలను కూడా కేసీఆర్‌ చులకనగా చూస్తాడు అనేది చాలా మంది చెప్పిన మాట. దాని కారణంగానే చాలా మంది పార్టీకి దూరమయ్యారు అనేది కూడా ఓ విమర్శ. కేసీఆర్‌ వ్యవహారశైలే బీఆర్ఎస్‌ను ముంచింది అని ఆయన పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయశాంతి ఇచ్చిన కౌంటర్‌ హైలెట్‌ అయ్యింది. విజయశాంతి ట్వీట్‌కు కాంగ్రెస్‌ నేతలు సపోర్ట్‌ చేస్తుంటే.. బీఆర్ఎస్‌ నేతలు మాత్రం కౌంటర్లు ఇస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అన్నిటికీ త్వరలోనే సమాదానం చెప్పి తీరుతామని కామెంట్లు పెడుతున్నారు.