YS SHARMILA: షర్మిలను బలిచేస్తున్న కాంగ్రెస్‌.. ఆమెకు ఆ చాన్స్‌ ఎందుకివ్వలేదు?

ఏపీలో కాంగ్రెస్‌కు ఊపిరి పోస్తా.. అలసిపోయిన కాంగ్రెస్ ప్రాణాలకు ఆశాదీపాన్ని అవుతా అంటూ.. రచ్చబండ పేరుతో ఏపీలో జిల్లాల పర్యటన చేపడుతున్నారు. అన్న జగన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రత్యేక హోదా అంటూ.. బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 04:26 PM IST

YS SHARMILA: తెలంగాణ కోడలిని.. రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ.. వైటీపీ పేరుతో ఓ పార్టీ ఏర్పాటు చేసి.. కాళ్లు అరిగే వరకు తిరిగి తిరిగి.. చివరికి అలసిపోయి.. మద్దతిచ్చేవాళ్లు లేక, మద్దతు దొరుకుందనే ఆశ కనిపించక.. చివరికి కాంగ్రెస్‌కు జై అని.. తెలంగాణను విడిచిపెట్టారు షర్మిల. ఆ తర్వాత హస్తం పార్టీ నుంచి వచ్చిన వరుస ఆఫర్లతో.. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త పాట అందుకున్నారు.

BJP-BRS: బీజేపీ–బీఆర్ఎస్ పక్కా స్కెచ్.. ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది..?

ఏపీలో కాంగ్రెస్‌కు ఊపిరి పోస్తా.. అలసిపోయిన కాంగ్రెస్ ప్రాణాలకు ఆశాదీపాన్ని అవుతా అంటూ.. రచ్చబండ పేరుతో ఏపీలో జిల్లాల పర్యటన చేపడుతున్నారు. అన్న జగన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రత్యేక హోదా అంటూ.. బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. షర్మిల ప్రభావం ఏపీ పాలిటిక్స్‌లో ఎంత అన్న సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు నమ్ముకన్న కాంగ్రెస్ ఆమెను బలి చేసేందుకు సిద్ధం అయిందా అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు.. మొదట్లో షర్మిల అసలు ఒప్పుకోలేదు. ఐతే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలతో పాటు.. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామనే హామీని కాంగ్రెస్ ఇవ్వడంతో.. అయిష్టంతోనే ఏపీ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యారు షర్మిల. ఏపీ పీసీసీ చీఫ్ పదవి అయితే దక్కింది కానీ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడం.. కర్ణాటక నుంచి రాజ్యసభకు తనను పంపిస్తాననే హామీలు హస్తం పార్టీ పెద్దలు మర్చిపోవడం.. పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో.. షర్మిల పరిస్థితి గందరగోళంగా తారయింది. షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకుండా.. కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యం తగ్గించిందనే ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, హుస్సేన్, చంద్రశేఖర్లను రాజ్యసభకు పంపిన కాంగ్రెస్‌.. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నా.. ఆమెకు ఇవ్వలేదు. నిజానికి షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే.. ఆమెకు ప్రోటోకాల్ వస్తుందని.. దీంతో ఏపీలో విస్తృతంగా పర్యటించేందుకు మరింతగా ఉపయోగం అవుతుందని అంతా అనుకున్నారు. ఐతే షర్మిలను మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా.. ఇప్పుడు షర్మిల పరిస్థితి ఏంటి అన్నదే మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్‌లో జోష్‌ కనిపిస్తుందేమో కానీ.. అది ఓట్లుగా మారుతుందనే నమ్మకం లేదు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరికీ కనీసం డిపాజిట్లు దక్కకుండా.. 2019 ఎన్నికల సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి అదే జరిగితే.. షర్మిల పరిస్థితి ఏంటి.. రాజ్యసభ లేక, పదవి లేక ఆమె బలి అయినట్లే కదా అనే చర్చ జరుగుతోంది.