PRAJA PALANA: తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ.. ప్రజలకు ఆరు హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను అమలు చేస్తామంటూ చెప్పింది. కాంగ్రెస్‌ను పూర్తిగా నమ్మిన ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇక హామీలు అమలు చేయాల్సిన సమయం వచ్చింది. ఆరు హామీల్లో ఒకటిగా ఉన్న మహాలక్ష్మి పథకాన్ని ఇప్పటికే అమలు చేశారు. ఇక మిగిలిన ఐదు పథకాలను కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది.
Grandhi Srinivas: పవన్ కల్యాణే కావాలి.. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్..!
ఇందుకు సంబంధించి ఓ అప్లికేషన్ ఫాంను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభత్వం అందించే పథకాలు పొందాలి అనుకున్నవాళ్లు ఆ అప్లికేషన్ నింపి దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ల నుంచి అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వం పథకాలు అందిస్తుంది. మొత్తం 5 పథకాలకు ఒకే అప్లికేషన్‌ను కామన్‌గా పెట్టింది ప్రభుత్వం. డిసెంబర్ 28 నుంచి పథకాలకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటించడంతో రెండు రోజులుగా ప్రభుత్వానికి దరఖాస్తుల వెల్లువ మొదలైంది. రెండు రోజుల్లో దాదాపు 15 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నారు అధికారులు. మొదటి రోజు 7 లక్షల 46 వేల 414 అప్లికేషన్లు వచ్చాయట. ఇక రెండో రోజు అంతకు మించి అప్లికేషన్లు వచ్చినట్టు చెప్తున్నారు. మొదటి రోజుతో కంపేర్ చేస్తే రెండో రోజు లక్ష అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయట. రెండో రోజు 8 లక్షల 12 వేల 862 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే పథకాల కోసం అప్లై చేసుకునేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల 23 వేల 862 అప్లికేషన్లు వస్తే.. పట్టణ ప్రాంతాల్లో 4 లక్షల 89 వేల అప్లికేషన్లు వచ్చాయి.
ఇక ఎక్కడివాళ్లు అక్కడే అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పడంతో చాలా మంది స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఏ వ్యక్తి పథకం కోసం అప్లై చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం కండీషన్ పెట్టడంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లారు. కానీ ప్రజల నుంచి వచ్చిన వినతుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిబందనను సవరించింది. వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదని కుటుంబంలోని ఎవరైనా వచ్చి అప్లికేషన్ ఇవ్వొచ్చంటూ చెప్పింది. దీంతో ప్రజలు కార్యాలయాలకు క్యూ కట్టారు. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అన్ని పథకాలకు ఒకే అప్లికేషన్ కావడంతో ప్రజలు కూడా అప్లికేషన్ ఎగబడుతున్నారు. రెండు రోజుల్లోనే 15 లక్షలకు చేరిన అప్లికేషన్లు ముందుముందు ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి.