CONGRESS SCHEMES: పథకాల అమలు ఎప్పటి నుంచి ?.. డిసెంబర్ 28 నుంచి కీలక పథకం అమలు?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని.. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ 28న మరో కీలక పథకం మొదలవువుతుందని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 02:25 PM IST

CONGRESS SCHEMES: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ప్రచారంలో తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కోటి అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని.. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ 28న మరో కీలక పథకం మొదలవువుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హింట్ ఇవ్వడంతో.. ఆ రోజు ఏంటి ప్రత్యేకత.. అసలు ఏ స్కీమ్ స్టార్ట్ చేస్తారన్న ఆసక్తి తెలంగాణలో పెరిగింది.

GROUP 2: గ్రూప్‌ 2 పరీక్షపై రేవంత్ కీలక నిర్ణయం

డిసెంబర్ 9న సోనియా పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ అంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకరయం కల్పించారు. సిటీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్ లతో పాటు.. జిల్లాలకు వెళ్ళే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా వెళ్తున్నారు. మహిళలు భారీ ఎత్తున ఈ స్కీమ్ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో 15 శాతం దాకా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు త్వరలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఉచిత బస్సు పథకం మొదలైన రోజునే.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో అన్ని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ లిమిట్ పది లక్షల రూపాయల దాకా పెరిగింది. ఇక ఆరు గ్యారంటీల్లో మిగిలిన కీలకమైన పథకాలను ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుందా అని జనం ఎదురు చూస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్‌పై పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్‌ను 100 రోజుల్లోనే తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరికొన్ని స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28నుంచి అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన పథకాల్లో ఇంకా కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. 500కే గ్యాస్ సిలెండర్, 200యూనిట్ల వరకూ కరెంట్ ఛార్జీలు ఫ్రీ.. మహిళలకు నెలకు 2 వేల 500 పథకం లాంటివి ఉన్నాయి. వీటిల్లో వేటిని డిసెంబర్‌ 28 అమలు చేస్తారన్నదానిపై చర్చ మొదలైంది. గ్యాస్‌ సిలిండర్‌ ఐదు వందల స్కీమ్ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోకముందే.. ఈ-కేవైసీ చేస్తున్నారంటూ కొన్ని ఏరియాల్లో జనం గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలు కట్టారు. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి విధి విధానాలను ఇప్పటి వరకూ ప్రకటించలేదు. కానీ జనంలో పాపులర్ ఉన్న ఈ 500 సిలెండర్ స్కీమ్.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున ప్రారంభిస్తారన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆరు గ్యారంటీలు అమలైతే మాత్రం.. ఇంటి బడ్జెట్‌లో చాలా ఖర్చులు తగ్గిపోతాయని మధ్యతరగతి, సామాన్య జనం లెక్కలు వేసుకుంటున్నారు.