ASSEMBLY ELECTIONS: మనీ పాలిటిక్స్.. ఎంతయినా సరే.. గెలవాల్సిందే ! ఈ నియోజకవర్గాల్లో నోట్ల కట్టలే..!

నియోజకవర్గాల్లో BRS, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులే కాకుండా BSP, స్వతంత్రులు కూడా భారీగా పోటీపడుతున్నారు. కానీ కాంగ్రెస్, BRS లీడర్లు మాత్రం గెలిచితీరాలి అనే పట్టుదలతో ఉన్నారు. దాంతో ధన ప్రవాహం ఏరులై పారుతోంది.

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 05:25 PM IST

ASSEMBLY ELECTIONS: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అన్నిపార్టీల అభ్యర్థులు. నియోజకవర్గాల్లో BRS, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులే కాకుండా BSP, స్వతంత్రులు కూడా భారీగా పోటీపడుతున్నారు. కానీ కాంగ్రెస్, BRS లీడర్లు మాత్రం గెలిచితీరాలి అనే పట్టుదలతో ఉన్నారు. దాంతో ధన ప్రవాహం ఏరులై పారుతోంది. ఎన్నికల కోడ్ వచ్చాక 500 కోట్ల రూపాయల దాకా పోలీసులు సీజ్ చేశారు. కానీ దొరికిన డబ్బులో పొలిటికల్ లీడర్ల డబ్బులు తక్కువే.

Congress Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకే అంకితం..

ఎక్కువగా సామాన్య జనం డబ్బులే పట్టుబడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఖర్చుచేయడానికి 40 లక్షల రూపాయల దాక పరిమితి ఉంది. అంతేకాదు ఈసారి బిర్యానీకి ఎంత, టీకి ఎంత.. వెహికిల్, జెండాలు, బ్యాడ్జీలు ఇలా దనికి ఎంత ఖర్చు చూపించాలో విడివిడిగా ఈసీ ప్రకటించింది. కానీ ఎన్నికల కమిషన్ చెబుతున్న రూ.40 లక్షల ఖర్చు చాలా చోట్ల ఒకట్రెండు రోజులకు కూడా సరిపోదని అంటున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తయ్యేనాటికి 100 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం, ఎల్బీనగర్‌తో పాటు.. తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో ఈసారి ఖర్చు కోట్లల్లోనే ఉండొచ్చని భావిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో రూ.50 కోట్లకు పైనే ఖర్చు ఉండొచ్చని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపోటీ చేస్తున్న ములుగులో డబ్బు ప్రభావం భారీగా ఉండొచ్చని తెలుస్తోంది.

CM KCR: రైతులు గడపదాటకుండా నగదు జమ చేస్తున్నాం.. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్: సీఎం కేసీఆర్

దాదాపు 200 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి BRS ప్లాన్ చేస్తోందని సీతక్క ఆరోపించారు. ప్రస్తుతం ప్రచారానికి కూడా అభ్యర్థులు భారీ స్థాయిలో ఖర్చుపెడుతున్నారు. తమ వెంట తిరిగేందుకు కార్యకర్తకు ఒక పార్టీ రూ.500 ఇస్తే.. మరో పార్టీ వెయ్యి ఇస్తామంటోంది. ఇంటింటికీ పాంప్లేట్స్‌తో పాటు.. డిజిటల్ ప్రచారానికి కూడా భారీగా ఖర్చుపెడుతున్నారు అభ్యర్థులు. మహేశ్వరం నియోజకవర్గంలో ఈసారి ఖర్చు బాగానే పెట్టబోతున్నారు అభ్యర్థులు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి అందె శ్రీరాములు మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఎంత ఖర్చయినా తగ్గేది లేదని ముగ్గురు లీడర్లూ భావిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.

కొడంగల్ సీటును ఎలాగైనా గెలవాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. రేవంత్‌ను ఓడించడానికి బీఆర్ఎస్ కూడా కోట్లరూపాయలు ఖర్చు చేయడానికి రెడీ అవుతోంది. సో.. ఇక్కడ కూడా నగదు ప్రవాహం ఎక్కువగానే ఉండే ఛాన్సుంది. గెలుపే లక్ష్యంగా ప్రముఖులు పోటీ పడుతున్న స్థానాల్లో ఈసారి ఓటుకి నోటు కూడా భారీగానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కోట్ల రూపాయల ఖర్చుకు ఎన్నికల కమిషన్ ఎలా చెక్ పెడుతుందన్నది చూడాలి.