దగ్గుబాటి ఫ్యామిలి 10 రోజుల ఫ్రాన్స్, ఇటలీ యాత్ర

"గతంలో నేను ప్రపంచ దేశాల యాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా స్నేహితుల తోటి కలిసి వెళ్తుండేవాడిని. ఈసారి మనవరాలు శ్రేష్ట (14), మనవడు జయరాం (13)లను దసరా సెలవుల్లో ఫ్రాన్స్ ఇటలీ దేశాల్లో స్టడీ టూర్ లాగా చేయాలని నేను పురందరేశ్వరి నిర్ణయించాము.

  • Written By:
  • Publish Date - October 9, 2024 / 04:35 PM IST

“గతంలో నేను ప్రపంచ దేశాల యాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా స్నేహితుల తోటి కలిసి వెళ్తుండేవాడిని. ఈసారి మనవరాలు శ్రేష్ట (14), మనవడు జయరాం (13)లను దసరా సెలవుల్లో ఫ్రాన్స్ ఇటలీ దేశాల్లో స్టడీ టూర్ లాగా చేయాలని నేను పురందరేశ్వరి నిర్ణయించాము. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్, ఇటలీ ల పర్యటన కు బయలుదేరి, మూడు రోజులు..france పర్యటనను ముగించాము. ఈ సందర్భంగా versailles ప్యాలెస్ n, louvre మ్యూజియం ఈఫిల్ టవర్, siene river ఇంకా పలు చోట్లను paris లో సందర్శించాము.

ఫ్రాన్స్ చరిత్రలో బాగాలైన ఫ్రెంచ్ విప్లవం ….ఏ విధంగా బూర్బన్ వంశ రాజులు …1661 లో అధికారంలోకి వచ్చిన తరువాత,లూయి 14, 15, 16 లు నిరంకుశంగా పాలన గావించింది, ప్రజాభిప్రాయాన్ని ప్రతిభంభించే పార్లమెంటును (175 సంవత్సరాలు) 1614 నుండి సమావేశ పరచకపోవటం, ప్రజల అసంతృప్తిని, అశాంతిని రాజు గమనించక రాజువర్గం, మతాచార్యుల వర్గం , versailles గడిపారు, ఏ విధంగా 14వ లూయిస్ కాలంలో (1643 నుండి 1715 వరకు) ఫ్రాన్స్ అత్యంత వైభవాన్ని పొంది నా.. అతను నిర్వహించిన యుద్ధాల వలన ఖజానా ఖాళీ అయింది. తర్వాత రాజైన 15వ లూయిస్ (1717 నుండి 1774 వరకు) వేట, జూదము, వ్యభిచారం పై ఆసక్తి చూపటం వలన ప్రజల తిండి లేక పన్నుల భారంతో కృంగి, కృషించారు.

అతని తరువాత లూయస్ 16 తన భార్య మేరీ అంతులేవా అనుభవం లేకుండా రాజ్య కార్యకలాపాల్లో జోక్యంతో…. ఆనాటి ఫ్రెంచ్ సమాజం రాజువర్గమైన మతాచార్యులు, మరియు భూస్వాములు కలిసి ఒక వర్గంగా, ప్రజానీకం రెండవ వర్గంగా ఏర్పడి ఫ్రెంచ్ విప్లవానికి దారితీసింది. రాజు వర్గమైన మతాచార్యులు,భూస్వాములు ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. . ప్రజలు మాత్రం పన్నులు చెల్లించేవారు. ప్రజల తరఫున Robespierre, Donton లు నాయకత్వం వహించారు. ఫ్రెంచ్ తత్వవేత్తలైన మాంటెస్క్యూ, వాల్టర్, రుసోల రచనలు ఫ్రెంచ్ ప్రజలను విప్లవం దిశగా ప్రభావితం చేశాయి. 1789లో లూయిస్ 16 ఎస్టేట్ సభను నిర్వహించగా ప్రజలు వ్యతిరేకించి దగ్గరలో ఉన్న టెన్నిస్ కోర్టులో సభ నిర్వహించారు. 1789 జులై 11, 12 తేదీల్లో ప్రజలు ఉద్యమించి BASTILLE JAIL ను ముట్టడించి.. రాజుని వ్యతిరేకించిన వేలాదిమందిని నిర్బంధము నుండి విడిపించారు. అప్పటినుంచి జూలై 14 ను జాతీయ దినముగా ఫ్రెంచ్ దేశస్తులు భావిస్తుంటారు. చివరకి 1793లో 16వ లూయి ని వధించి ఉద్యమకారులు france ను గణతంత్ర రాజ్యం రాజుగా ప్రకటించారు. అనే విషయాలు మనుమరాలు శ్రేష్ట, మనుమడు జయరాం ల కు వివరించటం జరిగింది.

తరువాత నెపోలియన్ చరిత్ర కూడా చెప్పడం జరిగింది. నెపోలియన్ 17 సంవత్సరాల వయసులో మిలటరీలో చేరాడు. 16వ లూయిస్ ని ఉరితీసిన తరువాత విప్లవకారులలో విభేదాలు తలెత్తి ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడిపోగా నెపోలియన్ ఫ్రెంచ్ ని తన అధీనంలోకి తీసుకొని సర్వ సైన్యాధ్యక్షుడుగా ప్రకటించుకొని 1804 – 1815 వరకు చక్రవర్తి అయ్యాడు. నెపోలియన్ అనేక సంస్కరణల్లో భాగంగా french బ్యాంకును స్థాపించి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచాడు. జాతీయ విద్యా విధానం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రగ్రతిని కనపరిచాడు. సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, శిక్షాస్మృతి, వ్యాపారస్మృతులు ఏర్పాటు చేశారు. ఇవి మొత్తం యూరప్ కు ఆదర్శమయ్యాయి. భూస్వాముల అధికారం రద్దు చేయడం, బానిస విముక్తి కి చట్టాలు చేయబడ్డాయి. వలస రాజ్యాల స్థాపనకు నెపోలియన్ ఉద్యుక్తుడు కాగా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ పై యుద్ధం ప్రకటించింది. రష్యా, స్పెయిన్, ఆస్ట్రియా ఇత్యాది దేశాలపై యుద్ధాలకు తలపడ్డాడు. జర్మనీతో సహా తూర్పున రష్యా నుండి పశ్చిమాన స్పెయిన్ వరకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చివరకు లీప్జింగ్ వద్ద యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు. ఎల్బా ద్వీవి కి ప్రవాసానికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి ఫ్రాన్స్ గడ్డపై కాలు పెట్టగా ప్రజలు స్వాగతం పలికారు. 1815 లో మళ్ళీ ఇంగ్లండుతో యుధ్ధంలో వాటర్లూ వద్ద DUKE WELLINGTON చే ఓడింపబడి SENT HELANA దేవికి తరలింపబడ్డాడు. అక్కడే మరణించాడు.

సంతోషకరమైన విషయం ఏమిటంటే…. ఈ చరిత్ర అంతా చెబుతున్నప్పుడు మనుమరాలు శ్రేష్ట ఈ చరిత్రలోని అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చదివి వీటిపై అనేక ప్రశ్నలు సంధిస్తూ ఈ అంశాలను గుర్తుకు తెచ్చుకొని నాకు చెప్పటం మాకు మిక్కిలి సంతోషాన్ని కలిగించింది. ఈ విధంగా మూడు రోజులు ప్యారిస్ లో యాత్ర నిర్వహించి, రేపు ఇటలీ దేశమైన రోమ్ నగరంనకు ప్రయాణమయ్యాము.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం జర్మనీ ఓడిపోయిన తర్వాత ఏ విధంగా జర్మనీ యుద్ధానంతరం నష్టపరిహారాన్ని మిత్ర రాజ్యాలకు చెల్లించాలి అనే అంశాలు గురించి చర్చించేందుకు ఒక చారిత్రకమైన ప్రదేశం వర్షియైల్ ప్యాలెస్ లో సమావేశం నిర్వహించారు.దీనినే చరిత్ర లో VERSAILL PACT అంటారు… ఆమందిరాన్ని మేము సందర్శిస్తున్న VIDIO ను మీ . Luover muesam దగ్గర దిగిన చిత్రాల ను కూడా”