దస్తగిరి సంచలన కామెంట్స్, చంద్రబాబును కలుస్తా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేసారు. 2023 అక్టోబర్ 31 తేదీ వైసిపి కుట్ర వల్ల జైలు కు వెళ్ళాను అని అన్నారు.

  • Written By:
  • Publish Date - August 27, 2024 / 03:18 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేసారు. 2023 అక్టోబర్ 31 తేదీ వైసిపి కుట్ర వల్ల జైలు కు వెళ్ళాను అని అన్నారు. జైల్లో ఉన్న సమయంలో ఏ5 నిందితుడు దేవి రెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించాడని పేర్కొన్నారు. మెడికల్ క్యాంపు పేరుతో జైల్లో ప్రవేశించి బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనిపై నాడు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు అన్నారు. ఈ రోజు మళ్ళీ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయబోతున్న అన్నాడు దస్తగిరి.

నవంబర్ 28 మెడికల్ క్యాంపు పేరుతో వచ్చి బెదిరించారని పేర్కొన్నాడు. ఆ రోజు నన్ను బెదిరించిన చైతన్య రెడ్డి మీద ఫిర్యాదు చేస్తా అని ఆ రోజు జైలు సిసి ఫుటేజ్ ఏమైంది అని నిలదీశారు. అప్పుడు బీటెక్ రవి జైల్లో ఉన్నారు అన్నారు. బీటెక్ రవి సాక్షిగా పెట్టి మళ్ళీ విచారణ చేయాలి అని డిమాండ్ చేసారు. కూటమి ప్రభుత్వం వైయస్ వివేకా కేసు చాలెంజ్ గా తీసుకుంటుందని… నేను తప్పు చేసినా నా మీద చర్య తీసుకోవచ్చు అన్నారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తా అని పేర్కొన్నారు. జైల్లో ఉన్న ఖైదీలు, అధికారులు సాక్ష్యం చెబుతారని అన్నారు. వైయస్ వివేకా హత్య కేసులో నాకు జరిగిన అన్యాయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి వివరిస్తా అన్నారు దస్తగిరి.