T CONGRESS: తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాట? ఇంఛార్జ్‌ను మార్చిన ఏఐసీసీ

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీపాదాస్ పరిశీలకురాలిగా పని చేశారు.

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 05:29 PM IST

T CONGRESS: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఇంఛార్జ్‌ వచ్చారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కొత్త ఇంఛార్జ్‌ను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీపాదాస్ పరిశీలకురాలిగా పని చేశారు. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే ఈ దీపాదాస్ మున్షీ.

Revanth Reddy: డిసెంబర్ 28 నుంచి ప్రజా పాలన.. ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు

ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన మాణిక్ రావ్ థాక్రేను.. గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది ఏఐసీసీ. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వున్న మాణిక్కం ఠాగూర్ అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయన స్థానంలో మాణిక్ రావ్ థాక్రేను నియమించింది హైకమాండ్. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌లో కుమ్ములాటలు, వర్గవిభేదాలను పరిష్కరించే పనిని ఆయన భుజానికెత్తుకున్నారు.

రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూనే సీనియర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అలాగే అభ్యర్ధుల ఎంపికపైనా ఆయన సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా చేశారు. అధిష్టానం సూచనలతో పాటు తనదైన వ్యూహాలతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. అలాంటిది మాణిక్ రావ్ థాక్రేను ఎన్నికలు ముగిసి రోజులు తీరగకుండానే బదిలీ వేటు వేయడం కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.