DELHI LIQUOR SCAM: చార్జిషీట్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పేరు

  • Written By:
  • Publish Date - February 2, 2023 / 02:06 PM IST

ఢిల్లీ లిక్కర్‌ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. చార్జిషీట్‌లో రోజుకో కొత్త పేర్లు చేర్చుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండో చార్జీషీట్‌ను ఫైల్‌ చేసిన అధికారులు కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. చార్జిషీట్‌లో ఈడీ అధికారులు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా చార్జిషీట్‌లో వైసీపీ ఎంపీ మాగుంట పేరును కూడా చేర్చారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడంతో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక్కసారిగా ఊహించని మలుపు తిప్పింది.

428 పేజీలతో కూడిన రెండో చార్జీషీట్‌ను ఈడీ విడుదల చేసింది. ఎక్సైజ్‌ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్‌ నాయర్‌తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను మొత్తం నడిపించింది విజయ్‌ నాయర్‌ అంటూ చార్జిషీట్‌లో ప్రస్తావించారు. అంతేకాకుండా విజయ్‌ నాయర్‌.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్యాంప్‌ ఆఫీస్‌లోనే లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన తతంగం అంతా నడిచినట్లు ఈడీ పేర్కొంది.

ఇదిలా ఉంటే రెండో ఛార్జిషీట్‌లో తన పేరును ప్రస్తావించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ అనేది ఎమ్మెల్యేల కొనుగోళ్ల సంస్థ అని సీఎం అభివర్ణించారు. అధికారంలో ఉన్న పార్టీ కోసం ఈడీ పనిచేస్తుందని, అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పనిచేయడం లేదని వమర్శించారు. ఇక ప్రభుత్వాలను కూల్చడానికే ఈడీ పనిచేస్తుందని కేజ్రీవాల్‌ మండిపడ్డారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం తమ కేంద్రప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని ఇలా రాష్ట్రపభుత్వాలను ఇరుకున పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మన్న తెలంగాణలో కవిత పేరు ఉందని విచారణకు కూడా పిలిపించి విచారణ చేపట్టారు. ఇలా తమకు రాజకీయంగా అడ్డుగా ఉన్న వారిని ఇలా కేసులు రూపంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని కొందరు చెబుతున్నారు.