Delhi: లిక్కర్ స్కామ్‌లోకి సుఖేష్‌ చంద్రశేఖర్‌.. ఎవరితను.. బీఆర్ఎస్‌తో సంబంధం ఏంటి ?

ఢిల్లీ నుంచి గల్లీ వరకు లిక్కర్ స్కామ్‌ రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో.. మరింత చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి కేసు భారీ ట్విస్ట్ కనిపించింది. సుఖేష్ చంధ్రశేఖర్ అనే ఖైదీ.. బాంబ్ పేల్చాడు. ఇప్పటికే 2వందల కోట్ల హవాలా కేసులో అరెస్ట్‌ అయి.. తీహార్ జైల్లో ఉన్న సుఖేష్.. బీఆర్ఎస్, ఆప్ పార్టీలపై పెద్ద బాంబ్ పేల్చాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా 75కోట్ల గుట్టు విప్పేశాడు. ఇదంతా బీఆర్ఎస్ ఆఫీసులోనే జరిగిందంటూ కొన్ని విషయాలు బయటపెట్టాడు.

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 11:00 PM IST

ఈ విషయానికి సంబంధించి.. కేజ్రీవాల్ చేసిన 7వందల పేజీల వాట్సాప్ చాట్ తన దగ్గర ఉందని.. త్వరలోనే అన్నీ బయటపెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో వంద కోట్ల ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. సుఖేష్‌ బయటపెట్టిన లేఖ.. మరింత చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ తరఫున 2020లోనే… హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఆఫీసులో 75 కోట్లు ఇచ్చినట్టు ఆ లెటర్‌లో రాసుకొచ్చాడు సుఖేష్‌. ఈ ఆపరేషన్‌కు 15కిలోల నెయ్యి అనే కోడ్ వర్డ్ పెట్టుకున్నట్టు చెప్తున్నాడు.

కేజ్రీవాల్‌తో చేసిన వాట్సాప్‌, టెలిగ్రామ్‌ చాట్‌ను… సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తానంటున్నాడు. కేజ్రీవాల్, బీఆర్‌ఎస్‌ పార్టీలపై ఆరోపణలతో ఉన్న లేఖను.. తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా సుఖేశ్ చంధ్రశేఖర్ బయట పెట్టాడు. బీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలోనే రేంజ్ రోవర్‌లో ఉన్న ఏపీ అనే వ్యక్తికి 75కోట్లు ఇచ్చినట్టు ఆ లెటర్‌లో చెప్పాడు. ఆ ఏపీ అనే వ్యక్తి కూర్చున్న రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని కూడా లేఖలో తెలిపాడు. దీంతో ఏపీ అంటే ఎవరు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్లైయా లేక మరో వ్యక్తా అన్నది ఉత్కంఠ రేపుతోంది. కేజ్రీవాల్‌ను త్వరలోనే తీహర్ క్లబ్‌కు ఆహ్వానిస్తానని ఆ మధ్య కోర్టులో కామెంట్ చేయగా.. ఇప్పుడు ఇలాంటి కీలక ఆరోపణలు చేయటం చర్చనీయాశంగా మారింది. ఈ కామెంట్లతో సుఖేష్‌ చంద్రశేఖర్ ఎవరు అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. 2వందల కోట్ల హవాలా కేసులో సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నిందితుడు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి బయటపడేస్తానంటూ.. బిజినెస్‌మెన్‌ నుంచి డబ్బు తీసుకుని మోసం చేసిన కేసుల్లో సుఖేశ్ అరెస్టయ్యాడు.

ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఐతే జైలు బయట ఎంత విలాసవంతమైన జీవితం అనుభవించాడో.. జైలు గోడల మధ్య కూడా అదే లగ్జరీని అనుభవిస్తున్నాడు. సుఖేష్‌ ఉంటున్న జైలు గదిని అకస్మాత్తుగా తనిఖీ చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయ్‌. అక్కడ ఖరీదైన వస్తువులు లభించాయ్. పేరులోనే కాదు.. నిజ జీవితంలోనూ సుఖేష్ అనిపించాడీ సుఖేష్‌. విల్లాలు ఇస్తానని కొందరిని.. విలువైన బహుమతులు ఇచ్చి మరికొందరిని.. తన బుట్టలోవేసుకున్నాడు. హీరోయిన్లు జాక్వెలిన్, నౌరా ఫతేహీ.. సుఖేష్‌ మోసం చేసిన వారి జాబితాలో ఉన్నారు.