Amit Shah Deep Fake Video : హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసుల హల్ చల్.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్…?

హైదరాబాద్ కు మరో సారి ఢిల్లీ పోలీసులు (Delhi Police) చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

హైదరాబాద్ కు మరో సారి ఢిల్లీ పోలీసులు (Delhi Police) చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా రెండు రోజుల కిందటా.. సిద్దిపేట్ సభ లో అమిత్ షా (Amit Shah) ప్రసంగంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ అమిత్ షా వీడియోలో ప్రసంగించినట్లు డీప్ ఫేక్ తో తయారుచేశారని టీ బీజేపీ (BJP) జనరల్ సెక్రెటరీ ప్రేమేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ విభాగం ఎఫ్ఐఆర్ (నెం.1014/2024) నమోదు చేసింది. ఐపీసీ 153, 153A, 456, 469, 171G, 66C ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. దీంతో కేంద్ర హోంశాఖ సైతం సీరయస్ గానే స్పందించి.. కేసు విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.

టీపీసీసీ (TPCC) సోషల్ మీడియాకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండగా.. పలువురిని విచారిస్తారని తెలుస్తోంది. అటు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. తాజాగా మరోసారి రాష్ట్రానికి రావడంతో ఏమైనా అరెస్టులు జరుగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది.

SSM