పవన్ కామెంట్స్ కు కడప రెడ్డెమ్మ ఫిదా

కడప జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. విద్యా శాఖ నడిపిస్తున్న నారా లోకేష్ ఆద్వర్యంలో ఇలాంటి కార్యక్రమమని రాయలసీమ లో అత్యధికంగా లైబ్రరీలు ఉన్నాయి..

  • Written By:
  • Publish Date - December 7, 2024 / 04:21 PM IST

కడప జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. విద్యా శాఖ నడిపిస్తున్న నారా లోకేష్ ఆద్వర్యంలో ఇలాంటి కార్యక్రమమని రాయలసీమ లో అత్యధికంగా లైబ్రరీలు ఉన్నాయి.. చదువుల నేల రాయలసీమ, అందుకే కడప జిల్లా ఎంచుకున్నా అని తెలిపారు. నా భావాలను మీతో పంచుకోవాలని వచ్చాను అన్నారు పవన్. ఎంతోమంది మేధావులు పుట్టిన నేల రాయలసీమ అని కొనియాడారు.

అలాంటి నేలకు పునర్వైభవం కావాలని పవన్ ఆకాంక్షించారు. కడప లో నీటి సమస్య ఉంది ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్పారని నరేగా కేవలం గ్రామాలకు పరిమితమన్నారు. కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారని ఎక్కడ నుంచి వచ్చారు అని కాదు ఏం చేశారో ముఖ్యమన్నారు. ఉద్దానం సమస్య లేవనెత్తాను గతంలో అని గుర్తు చేసుకున్నారు. క్యాబినెట్ లో 40 కోట్లు పులివెందుల నీటి సమస్య కోసం కేటాయించామన్నారు. కడప నగరంలో నీటి సమస్య పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ పిల్లలు ట్యాబ్ సరైనా విధానం లో వాడుతున్నారా అని తల్లిదండ్రులు గమనించాలి..కడప మున్సిపల్ హైస్కూల్లో కిచెన్ కోసం నిధులు కావాలని కలెక్టర్ అడిగారని… స్కూల్ కిచెన్ కోసం ఎంత అవుతుందో అంతా నా ట్రస్ట్ నుంచి ఖర్చు చేస్తా అని స్పష్టం చేసారు. పవన్ కామెంట్స్ పై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. పాఠశాలలు ఎవరైనా సరే ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు పవన్. జిల్లా పరిషత్ స్థలాలు,ఆస్తులు ఎవరైనా ఆక్రమిస్తే గూండా యాక్ట్ పెట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు బలపడాలని కోరుకునే వాడిని నేనని ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీసుకురాగలమన్నారు.