మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేసారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో షిండే, ఆయన డిప్యూటీలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో కలిసి గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు చేరుకొని రాజీనామా సమర్పించారు. నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే వరకు… మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా షిండే బాధ్యతలు నిర్వహించనున్నారు.
శివసేన, బిజెపి, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)తో కూడిన మహాయుతి సంకీర్ణ కూటమి మరాఠా ఎన్నికల్లో 288 అసెంబ్లీ సీట్లలో 230 స్థానాలను గెలుచుకుంది. మహా వికాస్ అఘాడి కేవలం 46 స్థానాలతో మిగిలిపోయింది. ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ అత్యధికంగా 132 సీట్లు గెలుచుకోగా, షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.