Devineni Uma: రాజ్యసభకు ఉమా! దేవినేనికి చంద్రబాబు హామీ..

మైలవరంలో 2019లో ఉమాపై గెలిచిన వసంత కృష్ణప్రసాద్.. ఇప్పుడు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. దీంతో ఉమాకు అక్కడ అవకాశం పోయింది. ఐతే పెనమలూరు టికెట్ అయినా వస్తుందని ఆశపడినా.. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కే ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 05:47 PM IST

Devineni Uma: టీడీపీ అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయింది. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లకు పోటీపడుతున్న టీడీపీ.. ఇప్పటివరకు 139 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. 13 లోక్‌సభ స్థానాలకూ క్యాండిటేట్స్‌ను అనౌన్స్ చేసింది. ఇంకా 5అసెంబ్లీ, 4 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఐతే పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా టికెట్లు కేటాయించిన అధిష్ఠానం.. దేవినేని ఉమ లాంటి సీనియర్ లీడర్‌కు టికెట్ ఇవ్వకపోవడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ARVIND KEJRIWAL VS KAVITHA: కవిత VS కేజ్రీవాల్.. వన్ టు వన్‌కు సిద్ధమవుతున్న ఈడీ

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా.. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన నీటిపారుదల మంత్రిగా పనిచేశారు. 2019లో ఓటమి తర్వాత కూడా ఆయన పార్టీకి ప్రధానమైన గొంతుకగా ఉంటూ వైసీపీపై ఎప్పుడూ విరుచుకుపడేవారు. ఐతే మైలవరంలో 2019లో ఉమాపై గెలిచిన వసంత కృష్ణప్రసాద్.. ఇప్పుడు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. దీంతో ఉమాకు అక్కడ అవకాశం పోయింది. ఐతే పెనమలూరు టికెట్ అయినా వస్తుందని ఆశపడినా.. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కే ఇచ్చారు. నందిగామ నుంచి రెండుసార్లు, మైలవరం నుంచి రెండుసార్లు ఉమా ఎమ్మెల్యేగా గెలిచారు. ఐతే ఈసారి పోటీకి ఆయన ఆసక్తి చూపలేదన్న మాట వినిపిస్తోంది. ఆర్థికంగా బలహీనమయ్యారని.. ఆ కారణంగానే పోటీకి సుముఖత చూపలేదని తెలుస్తోంది.

ఈ విషయం ఉమ స్వయంగా చంద్రబాబుకే చెప్పారని.. దీంతో ఆయన్ను ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీకి పోటీ చేయడం కంటే.. టీడీపీ గెలిచాక రాజ్యసభకు వెళ్లడం బెటరని ఉమా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు దగ్గర ఆయన ఈ ప్రతిపాదన పెట్టినట్లుగా చెప్తున్నారు. చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ సానుకూలత వ్యక్తంచేసినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.