Devineni Vs Kesineni: కేశినేని వర్సెస్ దేవినేని.. నాలుగేళ్లు పార్టీని భ్రష్టు పట్టించావ్ !

పార్టీ మనుగడ కోసం చంద్రబాబు, లోకేష్‌లే వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు టీడీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా అతని సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై బహిరంగంగానే పార్టీ అధిష్టానంపై చాలాసార్లు నాని విరుచుకుపడ్డారు.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 02:03 PM IST

Devineni Vs Kesineni: ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అంతరం పెరిగిపోయింది. చివరకు ఒకరినొకరు డైరెక్ట్‌గా తిట్టుకునే స్థాయికి దిగజారారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో దుర్గమ్మ దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా స్వాగతం పలకడానికి వచ్చిన టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అమ్మవారి దర్శనం కోసం చంద్రబాబు అంతరాలయంలోకి వెళ్లేటప్పుడు దేవినేని ఉమా, కేశినేని చిన్ని వర్గానికి చెందిన వాళ్ళే తోసుకొంటూ లోపలికి వెళ్లారు.

Kamareddy : కామారెడ్డిలో కేవీఆర్ విజయ రహస్యం ఇదే !
ఎంపీ కేశినేని నానితో పాటు, మరికొందరు పార్టీ నేతలు.. లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. దీంతో చంద్రబాబు.. కేశినేని నానిని పిలవాలంటూ, తన భద్రతా సిబ్బందికి చెప్పారు. భద్రతా సిబ్బంది వచ్చి.. సార్‌ పిలుస్తున్నారు.. లోపలికి రావాలంటూ కేశినేని నానికి విజ్ఞప్తి చేశారట. లోపల స్థలం లేదులే.. ఇక్కడే ఉంటా అని కేశినేని నాని వారికి చెప్పినట్లు తెలిసింది. చివరకు దేవినేని ఉమ బయటకు వచ్చి.. కేశినేని నాని భుజంపై చెయ్యి వేసి లోపలికి వెళ్లాలని కోరారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీ కేశినేని నాని.. తన భుజంపై వేసిన చెయ్యిని విసిరికొట్టారు. యూజ్‌లెస్‌ ఫెలో.. మంత్రిగా ఉన్న నాలుగేళ్లు మీకు ఎవ్వరూ కనిపించలేదు. పార్టీని భ్రష్టు పట్టించావని ఫైర్ అయ్యారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమ సైలెంట్‌ అయ్యారట.

పార్టీ మనుగడ కోసం చంద్రబాబు, లోకేష్‌లే వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు టీడీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా అతని సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై బహిరంగంగానే పార్టీ అధిష్టానంపై చాలాసార్లు నాని విరుచుకుపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎంపీ కేశినేని నాని ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా చిన్ని ఆధ్వర్యంలో మూడు వర్గాలు పనిచేస్తున్నాయి. ఎంపీ మాత్రం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. ఎన్నికల సమాయత్తంలో భాగంగా ఈమధ్య పార్టీ ఆఫీసులో మైనార్టీ నాయకుల అవగాహన సదస్సు కూడా రసాభాసగా సాగింది. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి.. పరస్పరం చేయి చేసుకున్నారు.

Michoung Typhoon Effect : మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. లక్ష ఎకరాల్లో పంట నష్టం.. లబోదిబోమంటున్న రైతులు

దళిత శంఖారావంలోనూ ఎంపీ కేశినాని ఫొటో చిన్నదిగా పెట్టి.. ఏ హోదా లేని చిన్ని ఫోటోని బ్యానర్‌పై పెట్టారని టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. తనకు వ్యతిరేకంగా దేవినేని ఉమతో పాటు, కొందరు పార్టీ నేతలను..చంద్రబాబు, చిన బాబు ప్రోత్సహిస్తున్నారని ఎంపీ కేశినేని నాని రగిలిపోతున్నాడు. మైలవరంతో పాటు, విజయవాడలో ఈ వర్గాలకు వ్యతిరేకంగా ఎంపీ కేశినేని నాని పావులు కదుపుతున్నారు. అసలే వరుస పరాజయాలు.. అంతంతమాత్రంగానే ఉన్న టీడీపీ పరిస్థితి, ఇప్పుడీ వర్గ విభేదాలతో పూర్తిగా దిగజారిపోతోందని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. వర్గ విభేదాలతో ఎలాంటి పరిస్థితిని చూడాల్సి వస్తుందోనని పార్టీ వర్గాలు ఆందోళనగా ఉన్నాయి.