కేటీఆర్ ఢిల్లి కి ఎందుకు వెళ్ళాడు అంటూ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీశారు. మనోహర్ లాల్ కట్టను కలిసిన ఫోటోలు ఎందుకు బయట పెడుతలేదని నిలదీశారు. నిర్మన్ భవన్ లో ఏ మంత్రిని కలిసావు..సమాధానం చెప్పు అని ప్రశ్నించారు. అమృత్ పథకం స్టోరీ బిజెపి మహేశ్వర్ రెడ్డి మూడున్నర నెలల కిందట మాట్లాడాడన్న ఆయన… కేటీఆర్ ఏవేవో మత్తు పదార్థాలు సేవిస్తూ ఏదేదో మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. డ్రగ్స్ నిర్ధారణ విషయంలో కేసీఆర్ టెస్ట్ లకు సిద్ధం కండి అంటూ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతూ వ్యతిరేక ప్రభుత్వమన్న ఆయన… కాంగ్రెస్ ప్రభుత్వం లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మారితే పోయిలో నుండి పెనం మిద పడ్డట్లు గా మారింది రైతుల పరిస్థితని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు అతిపెద్ద రిలయెన్స్ సంస్థ రిలయెన్స్ తో బయోగ్యాస్ ప్లాంట్ ఒప్పందం చేసుకుంటు అభివృద్ధి కి పాటు పడుతున్నారని… గుజరాత్ తర్వాత అతిపెద్ద ప్లాంట్ ఆంధ్రలో ప్రారంభించారని తెలిపారు. రేవంత్ రెడ్డి చంద్ర బాబు నాయుడు శిష్యుడు కాదు కేసీఆర్ శిష్యుడిలా వ్యవహరిస్తున్నారన్నారు.