ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఓ క్లారిటీ ఉంది. చిన్న వయసులోనే ఐఏఎస్ గా ఉద్యోగం సంపాదించిన శ్రీలక్ష్మి ఎంతో ప్రతిభవంతురాలైన ఉద్యోగిగా సమర్ధురాలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె తాను సాధించిన ఘనతల కంటే అవినీతి ద్వారానే ఎక్కువగా ప్రజలకు పాపులర్ అయ్యారు. సాధారణంగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల గురించి సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందరో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు సామాన్య ప్రజల్లో పాపులర్ అయ్యారు.
కానీ శ్రీ లక్ష్మీ రేంజ్ లో మాత్రం ఏ అధికారి పాపులర్ కాలేదు. అత్యంత వివాదాస్పద అధికారిగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. దేశంలోనే తొలిసారి ఒక మహిళా ఐఏఎస్ అధికారి సుదీర్ఘకాలం జైల్లో ఉండటం కూడా ఆమెకే చెల్లింది. అవినీతి అనే మరక శ్రీలక్ష్మి జీవితం మొత్తం వెంటాడుతూనే ఉంటుంది. వైఎస్ జగన్ అక్రమాలకు శ్రీ లక్ష్మీ వత్తాసు పలికారని అప్పట్లోనే సిబిఐ అధికారులు సాక్షాలతో సహా తేల్చేశారు. సిబిఐ కేసులో అరెస్టు కావడం, సుదీర్ఘకాలం జైల్లో ఉండటం అప్పట్లో ఆమె జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీ లక్ష్మీ చేసిన సంతకాలు ఆమె జీవితానికి మాయని మచ్చ. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చినా… ఆమె స్థాయికి తగ్గ పోస్టు మాత్రం ఇప్పటివరకు దక్కలేదని చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో విధులు నిర్వహించిన శ్రీలక్ష్మి 2019 తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన అండదండలతో రాష్ట్రంలో అడుగు పెట్టారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన శ్రీలక్ష్మికి జగన్ అండగా నిలిచారు.
ఇక మళ్ళీ జగన్ పాలంలో ఆమె అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు చాలా వరకు వినిపించాయి. అలాగే ఆమె తెలుగుదేశం పార్టీ నేతలను కూడా ఇబ్బంది పెట్టారు అనే వాదన కూడా ఒకటి ఉంది. ఈ తరుణంలో ఆమెకు ఇప్పటివరకు పోస్టింగ్ దక్కలేదు. సమర్థవంతమైన అధికారి అయినా సరే ఆమెకు ఉన్న అవినీతి ఆరోపణలు ఆమె ఉద్యోగ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ మరో వారంలో ఉద్యోగ విరమణ చేయనున్నారు.
ఆయన తర్వాత అత్యంత కీలకమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి వాస్తవానికి శ్రీ లక్ష్మీ ఎంపిక కావాల్సి ఉంది. నీరబ్ కుమార్ ప్రసాద్ తర్వాత అంతటి అనుభవం ఉన్న అధికారి శ్రీలక్ష్మి మాత్రమే. అన్ని బాగుంటే ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యేవారు. కానీ కేసుల్లో చిక్కుకోవడం అలాగే వైయస్ జగన్ కు అన్ని విధాలుగా సహకరించడంతో ఆమె పేరుని అసలు… ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసలు పరిశీలించడం లేదు. గతంలో జగన్ హయాంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమె విధులు నిర్వహించారు. అప్పుడు ప్రభుత్వంలో అన్ని తానై వ్యవహరించారు అనే ఆరోపణలు కూడా ఉండేవి. ఇప్పుడు డైరెక్టుగా ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం ఉన్నా సరే గతంలో ఆమె బ్యాక్ గ్రౌండ్ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరును అసలు పరిశీలించడం లేదు.