DK Shiva Kumar: డిప్యుటీ సీఎం పదవికి ఒకే చెప్పీని డీకే.. డీకేతో ఫోన్‌లో మాట్లాడిన ఆ వ్యక్తి, శక్తి ఎవరు ?

కర్నాటక సీఎం ఎంపిక ఎపిసోడ్‌లో ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెర పడింది. అంతా అనుకున్నట్టే సిద్ధరామయ్యను సీఎంగా ఎనౌన్స్‌ చేసింది కాంగ్రెస్‌ హైకమాండ్‌.

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 11:48 AM IST

డైనమిజానికి సీనియారిటీకి మధ్య జరిగిన వార్‌లో ఎట్టకేలకు సీనియార్టీనే గెలిచింది. ఐతే నిన్నటి వరకూ ఎవరి మాట వినని డీకే శివకుమార్‌ ఒక వ్యక్తి నుంచి ఫోన్‌ రాగానే సైలెంట్‌ అయ్యారు. ఎంత మంది కూర్చోబెట్టి మట్లాడినా ససేమిరా అన్న నేత ఆ వ్యక్తి చెప్పగా మరో మాట లేకుండా డిప్యుటీ సీఎం పదవి తీసుకునేందుకు ఒకే చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో కాదు. కాంగ్రెస్‌ నేతలంతా అమ్మ అని పిలుచుకునే సోనియా గాంధీ. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షురాలు. శివకుమార్‌ను బుజ్జగించడంలో సీనియర్‌ నేతలంతా ఫెయిల్‌ అవ్వడంతో నేరుగా తాను రంగంలోకి దిగారట సోనియా గాంధీ.

నేరుగా డీకే శివకుమార్‌కు ఫోన్‌ చేసి సీఎం పదవి విషయంలో వెనక్కి తగ్గాలని సూచించారట. డిప్యుటీ సీఎం పదవితో పాటు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేయాలని సూచించారట. ఎంత మంది చెప్పినా మనసు మార్చుకోని డీకే శివకుమార్‌ సోనియా గాంధీ నుంచి ఫోన్‌ రావడంతో సైలెంట్‌ అయ్యారు. అమ్మ మాటను జవదాటకుండా డెప్యుటీ సీఎం పదవి తీసుకునేందుకు ఓకే చెప్పారు. దీంతో సిద్ధరామయ్యను సీఎంగా ఎనౌన్స్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

ఈ నెల 20న కర్నాటక 22వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే మంత్రులకు శాఖలు పంచే వ్యవహారం మాత్రం ఇంకా తేలనట్టు సమచారం. ఎంత మందికి మంత్రి పదవులు వచ్చాయనే విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. డీకే శివకుమార్‌కు మాత్రం డిప్యుటీ సీఎం పదవితో పాటు మరో మంత్రిత్వశాఖను కూడా ఆఫర్‌ చేసినట్టు సమాచారం. సిద్ధరామయ్యతో పాటే శివకుమార్‌ కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

కర్నాటక కాంగ్రెస్‌ గెలుపులో డీకే శివకుమార్‌ కీరోల్‌ ప్లే చేశారు. సీఎం సీటు కోసం ఆఖరి నిమిషం వరకూ సిద్ధరామయ్యతో పోటీ పడ్డారు. పవర్‌ షేరింగ్‌కు కూడా నో చెప్పారు. ఒకానొక స్టేజ్‌లో తనకు సీఎం ఇవ్వకపోయినా పర్లేదు కానీ సిద్ధరామయ్యకు మాత్రం సీఎం పదవి ఇవ్వకూడదని చెప్పారు శివకుమార్‌. వీళ్లిద్దరి మధ్య వార్‌ అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ బీజేపీకి ప్లస్‌ అవుతుందని అంతా భయపడ్డారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏకంగా సోనియా గాంధీ రంగంలోకి దిగారు. డీకేను డిప్యుటీకి ఒప్పించారు. దీంతో ఇప్పుడు కాస్త రిలాక్సింగ్‌గా ఫీలవుతున్నారు కన్నడ కాంగ్రెస్‌ నేతలు.