DK Shivakumar: తెలంగాణలో రెండు రోజులు డీకే శివకుమార్ పర్యటన..

శుక్ర, శనివారాల్లో డీకే.. తెలంగాణ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు. శుక్రవారం బెంగుళూరు నుంచి ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు.

  • Written By:
  • Updated On - November 23, 2023 / 08:25 PM IST

DK Shivakumar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం జాతీయ స్థాయి నేతలు తరలివస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దూకుడుగా ప్రచారం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు వరుసగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు తెలంగాణలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ పర్యటించబోతున్నారు.

Priyanka Gandhi Vadra: తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. శుక్ర, శని వారాల్లో పర్యటన

శుక్ర, శనివారాల్లో డీకే.. తెలంగాణ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు. శుక్రవారం బెంగుళూరు నుంచి ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. డీకే శివకుమార్‌తోపాటు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ప్రచారానికి హాజరవుతారు. అక్కడ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రి అంబర్‌పేట నియోజక వర్గం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్‌లోనే బస చేస్తారు. మరుసటి రోజు.. అంటే నవంబర్ 25న హైదరాబాద్‌లోని పలు నియోజక వర్గాలలో రోడ్ షో లు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొంటారు. ఈ మేరకు కాంగ్రెస్ డీకే శివ కుమార్ ప్రచారం కోసం తగిన ఏర్పాట్లు చేసింది.

అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించండి: రేవంత్ రెడ్డి
ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. “ముషీరాబాద్ ప్రజలకు అండగా ఉండే వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్. మీకు ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా అంజన్ కుమార్ యాదవ్ అందుబాటులో ఉంటారు. అంజన్ కుమార్‌కు, నాకు ఉన్న బంధం కుటుంబ అనుబంధం. కాంగ్రెస్‌ను ఆశీర్వదించేందుకు ముషీరాబాద్ ప్రజలే కాదు.. వరుణ దేవుడు కూడా వచ్చాడు. అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపిస్తే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది. మహిళలకు ప్రతీ నెల రూ.2500 అందిస్తాం. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. ఇల్లు కట్టుకునే పేదవాడికి రూ.5లక్షలు ఆర్థికసాయం అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. కేసీఆర్ ఉంటే పెన్షన్ రూ.2వేలే.. కేసీఆర్‌ను బొందపెడితే రూ.4వేలు పెన్షన్ వస్తుంది” అని రేవంత్ వ్యాఖ్యానించారు.