గత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్ట్ లో ఊరట లభించింది. రామ్ వర్మ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్ట్. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు… అప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు,ఫోటో మార్ఫింగ్ పోస్టులు చేశారంటూ వర్మ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల పరిధిలో పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఇదే కేసులో హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రామ్ గోపాల్ వర్మ… పలు మార్లు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరిగాడు. ఈ తరుణంలో కోర్ట్ లో ఊరట లభించింది.