లిక్కర్ స్కాం లో కవిత ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మార్చ్ 16 న హాజరు కావాల్సి ఉండగా ఆమె తన లాయర్ ద్వారా ఈడీకి లేఖ పంపి గైర్హాజరు అయ్యారు. మహిళను కాబట్టి ఇంట్లోనే ప్రశ్నించాలని, సుప్రీం కోర్ట్ లో కేస్ ఉంది కాబట్టి మార్చ్ 24 వరకు అంటే సుప్రీం కోర్ట్ చెప్పేవరకు తనను విచారణ చేయకూడదని ఆమె ఈడీకి ఇచ్చిన లేఖలో కోరారు. కానీ మార్చి 20న కచ్చితంగా రావాలని ఈడీ మళ్ళీ నోటీస్ పంపింది.
అయితే 20 న కూడా ఈడీ విచారణకు వెళ్లకూడదనే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో KTR, కవిత మధ్య వాదోపవాదాలు జరిగాయని సమాచారం. ఈడీ విచారణను ఎదుర్కొవడమే మంచిదని… తెగే వరకు లాగొద్దని KTR ఇచ్చిన సూచనను కవిత కొట్టిపడేసారట. ఈడీ విచారణకు వెళ్లే ప్రసక్తే లేదని, అరెస్ట్ చేయడానికి వస్తే అప్పుడు చూసుకుందామని ఆమె అన్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే 20న కవిత ఢిల్లీ వెళ్ళరు. హైదరాబాద్ లోనే ఉంటారు. ఒక వేళ ఈడీ అరెస్ట్ చేయడానికి వచ్చినా ఆ ప్రక్రియకి కొంత సమయం పడుతుంది. ఈడీ వారెంట్ తీసుకుని రావాల్సి ఉంటుంది. అప్పుడు కవిత యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేయవచ్చు. ఈ లోపు సుప్రీం కోర్ట్ ఆదేశాలు 24న వస్తాయి కనుక దానికి అనుగుణఁగా నిర్ణయం తీసుకోవచ్చని కవిత అంచనా.
ఇవన్నీ పక్కన పెట్టి ఈడీ కవితని అరెస్ట్ చేయడానికి వస్తే ఎవ్వరు ఆపలేరు.. అటువంటి సమయంలో అరెస్ట్ ను పొలిటికల్ గా వాడుకోవలన్నదే ఆమె ఆలోచన. ఈడీ హైదరాబాద్ వచ్చి కవితని అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లాలనుకుంటే BRS ఐడియా క్లిక్ ఐనట్లే. అరెస్ట్ సమయంలో నానా హంగామా చేస్తారు. మైలేజ్ ఎంత పిండుకోవాలో అంత పిండుకుంటారు. ఐతే ఇదంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితేనే. కవిత ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది త్వరలో తేలిపోతుంది. ఏది ఏమైనా లిక్కర్ స్కాం తెలంగాణలో భీకరమైన పొలిటికల్ వార్ కి దారి తీసింది.