మూలిగే నక్క మీద తాటిపండు పడటం అంటే ఇదే. చరిత్రలో కనివిని ఎరుగని దారుణమైన ఓటమితో కుమిలిపోతున్న జగన్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో కీలక నాయకులంతా రకరకాల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎవడో వేసిన ఉచ్చులో చిక్కుకున్నారా అంటే… అదీ కాదు. తాము చేసుకున్న స్వయంకృత అపరాదాలు… అతి వేషాలు తో పార్టీ పరువు తీస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వివాదం జగన్ పరువు తీసింది. ఆ పార్టీలో ఉన్న వాళ్లంతా ఆ బాపతు గాళ్లే అని జనం నవ్వుకోవడం తో వైసిపి అండ్ జగన్ గ్రాఫ్ మరింత దిగజారి పోతుంది . అందుకే రేపో మాపో దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు , అడల్ట్రీ పార్ట్నర్ దివ్వల మాధురి వ్యవహారం
వైసిపి తో పాటు జగన్ పరువును పూర్తిగా తీసింది. అసలు వైసీపీ నాయకులు అంతా ఇంతేనా…? వీళ్ళకి ఈ యవ్వారం తప్ప వేరే పని లేదా..? గడచిన ఐదేళ్లు ఇవే వెలగబెట్టారా..? అని జనం మాట్లాడుకుంటున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు చేసిన ఎదవ పని చాలా ఘనంగా చెప్పుకుంటూ దువ్వాడ శ్రీనివాస్, ఆయన అడల్ట్రీ పార్ట్నర్ మాధురి ప్రెస్ మీట్ లు నిర్వహించడం పార్టీ పరువును మరింత దిగజార్చింది. కనీసం జగన్ ఒక ఫోన్ కాల్ చేసి ఇక మీరు ఆపండి… నోరు మూసుకొని ఇంట్లో పడుండండి అని ఒక మాట అన్నా వ్యవహారం ఎక్కడికక్కడ నిలిచిపోయేది. శని ఆదివారాలు బెంగళూరు ప్యాలెస్ కి పరిమితమైపోయే జగన్ ఈ వ్యవహారాన్ని అసలు పట్టించుకోలేదు. దీంతో మీడియా చెలరేగి పోయింది .టిడిపి మీడియా మరింత చెలరేగిపోయింది. దీంతో పార్టీకి ఉన్న పరువు కాస్త పోయింది.
వైసిపి నేత దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. కాకపోతే ఆయనకి అడ్వాంటేజ్ ఆయన రాజకీయ ప్రత్యర్థులు అచ్చం నాయుడు కావడమే. బలమైన ప్రత్యర్థి తో పోటీ పడడం వల్ల దువ్వాడకు పార్టీలో గట్టి పేరే ఉంది. ముఖ్యంగా జగన్కు వీర విధేయుడు కావడంతో… వైసీపీలో కాలర్ ఎగరేసి తిరిగే నాయకుల్లో ఒకడయ్యాడు దువ్వాడ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దువ్వాడ పేరు రాష్ట్రమంతా వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆయన భార్య వాణి ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడమే. వెంటనే జగన్ వీళ్ళిద్దరిని పిలిపించి ఎప్పటిలాగే తల నిమిరి , వాణి చేత నామినేషన్ విత్ డ్రా చేయించి దువ్వాడకు బీఫామ్ ఇచ్చారు. కానీ దువ్వాడ భార్య వాణి అతనికి వ్యతిరేకంగా నామినేషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది అన్నదానిపైనే చర్చ మొత్తం జరిగింది. అప్పుడే దువ్వాడ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉందనే విషయం బయటకు వచ్చింది. భార్యను తీసుకొని జగన్ దగ్గరికి రాజీకి వెళ్ళిన రోజు కూడా దువ్వాడ వారు…. తన ద్వితీయ కళాత్రాన్ని బెజవాడ నోవోటేల్ హోటల్లో ఉంచారట. అదే విషయాన్ని వాణి జగనన్నకు చెప్పుకొని లబోదిబో మందంట. టెన్షన్ పడకు. ఎన్నికలు అయిపోని… మన గవర్నమెంట్ రాగానే నీ ఫ్యామిలీ సెట్ చేస్తానని చెప్పి జగనన్న దువ్వాడ ఫ్యామిలీ ని టెక్కలి పంపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటిలాగే టెక్కలిలో 30,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రాష్ట్రం మొత్తం యాంటీ వేవ్ లో జగనన్న కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ దువ్వాడ ఇంట్లో రావణ కాష్టం రగులుతూనే ఉంది.
దువ్వాడ శ్రీనివాస్ కాలింగ కులస్తుడు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు చాలా ప్రభావితం చేసే వర్గం. ఆర్థికంగా కూడా బలమైన వర్గం. వ్యాపారాలు ,ఉద్యోగాల్లో బాగా స్థిరపడిన వాళ్లు కాలింగ్లో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఒంటి మీద చొక్కా ప్యాంటు తోనే పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టాడు. టెక్కలి మాజీ ఎమ్మెల్యే సంపత్ రాఘవరావు కి దగ్గరయ్యాడు. సొంత కులస్తుడు కావడంతో రాఘవరావు కూడా దువ్వాడని దగ్గరికి తీశాడు. రాఘవరావు కూతురు వాణిని ప్రేమలో పడేసాడు శ్రీనివాస్. వాణి తో వివాహం, ఇద్దరు ఆడపిల్లలు అన్ని అనుకున్నట్లు జరిగిపోయాయి. మొదట పిఆర్పి తో పొలిటికల్ చేసిన శ్రీనివాస్ ఇప్పటివరకు ఒక్కసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఓడిపోయాడు దువ్వాడ. దీనికి ప్రధాన కారణం శ్రీనివాస్ వ్యక్తిత్వం కాగా టెక్కలిలో మొదటి నుంచి టిడిపి బలంగా ఉండడం.
శ్రీకాకుళం తో పాటు, ఒరిస్సా లోను దువ్వాడకు మైనింగ్ బిజినెస్ లు ఉన్నాయి. గడచిన ఐదేళ్లలో అడ్డు అదుపు లేకుండా సంపాదించాడనేది అందరూ చెప్పుకునే మాట. ఏం సంపాదించినా కూడా కుటుంబ జీవితం సరిగ్గా లేకపోవడం దువ్వాడకు మైనస్. భార్యతో చాలాకాలంగా విభేదాలు, తాజాగా 2022 నుంచి మాధురి తో అక్రమ సంబంధం దువ్వాడ పొలిటికల్ కెరీర్ కు గండి కొట్టాయి.2017లో ఒకసారి ఆత్మహత్య కూడా ప్రయత్నించి, ప్రాణాలతో బయటపడ్డాడు దువ్వాడ శ్రీనివాస్. మాధురి తో దువ్వాడ జరుగుతున్న వ్యవహారం టెక్కలిలో కుటుంబ పరువును పూర్తిగా మజాను పడేసింది. అందుకే దువ్వాడ, మాధురీలను అడ్డుకోవడానికి వాణి ఎన్నికల బరిలో దిగింది. జగన్ ఆమెను ఒప్పించి పోటీ నుంచి తప్పించడంతో అప్పటికి గట్టెక్కాడు శ్రీనివాస్. ఎన్నికలు అయిపోయిన తర్వాత కుటుంబంలో గొడవలు మరింత పెరిగాయి.
ఇప్పుడు ఏకంగా ధర్నాలు ప్రెస్మీట్ లు వరకు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్, మాధురి చేసేది తప్పు. రెండేళ్లుగా నియోజకవర్గంలో వాళ్ళిద్దరూ చేస్తున్న అరాచకం పార్టీ పరువు తీసింది. ఎంత జరిగా కూడా ఇద్దరు బరితెగించి ప్రెస్ మీట్ లు పెట్టి, టీవీ లైవ్ లోకి వచ్చి మేము అడల్ట్రీ లో ఉన్నాము చెప్పుకోవడం ఆశ్చర్యకరం. పైగా మేమిద్దరం కలిసి ఉండడానికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని పనికిమాలిన భాష్యాలు చెప్పడం ఇంకా దుర్మార్గం. అసలు మీరు రాజకీయ పార్టీ పేరు తో జిల్లాల్లో చేసే అరాచకాలు ఇవా…? ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, లిక్కర్ మాఫియా ఇవి చాలా అన్నట్లు అక్రమ సంబంధాలు… చివరికి వైసీపీ అంటే ఇలాగే ఉంటారు అనే పరిస్థితి తీసుకొచ్చారు దువ్వాడ, మాధురి లాంటివాళ్ళు. చివరికి జగన్ చుట్టూ ఉండే వాళ్లంతా ఇలాంటి పనికిమాలిన వాళ్లే అని సామాన్య జనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా జగన్ పై ఇంకా సానుభూతి రాకపోవడానికి కారణం దువ్వాడ, మాధురిలాంటి వాళ్లే.