Eatala Rajender: గజ్వేల్‌లో ఈటల మాస్టర్‌ప్లాన్‌.. కేసీఆర్‌కు మాములు షాక్‌ ఇవ్వట్లేదుగా..

నిజానికి కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్‌లో ఈటల టాప్‌ త్రీలో ఉండేవారు. కారు పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఈటల.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ గూటికి చేరుకున్నారు. కమలం పార్టీలో కీలక నేతగా ఉంటున్న ఆయన.. యాక్టివ్‌గా ఫీల్డ్‌లో కనిపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 02:22 PM IST

Eatala Rajender: బీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌.. కేసీఆర్ పేరు చెప్తేనే రగిలిపోతున్నారు. వాళ్లతో, వీళ్లతో కాదు.. నువ్వు, నేనే చూసుకుందాం.. ఢీ కొడదాం అన్నట్లుగా సవాళ్లు విసురుతున్నారు ఈటెల. గజ్వేల్‌లో కేసీఆర్‌కు పోటీగా బరిలోకి దిగడం వెనక కారణం కూడా అదే ! గజ్వేల్‌లో కేసీఆర్‌కు పోటీగా.. ఈటల అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలు.. ఇప్పుడు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయ్. సామాజికవర్గాలవారీగా ఓటు బ్యాంక్‌ను బలంగా మార్చుకోవడంతో పాటు.. కేసీఆర్‌ ప్రతీ బలహీనతను ఆయుధంగా మార్చుకోవాలని ఈటల ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు.

YS JAGAN: ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

నిజానికి కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్‌లో ఈటల టాప్‌ త్రీలో ఉండేవారు. కారు పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఈటల.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ గూటికి చేరుకున్నారు. కమలం పార్టీలో కీలక నేతగా ఉంటున్న ఆయన.. యాక్టివ్‌గా ఫీల్డ్‌లో కనిపిస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటలకు మంచి ఫాలోయింగ్ ఉన్నా.. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో గజ్వేల్‌లో కూడా పోటీ చేస్తున్నారు. ఐతే కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకే సెంటిమెంట్‌ అస్త్రాలను సంధిస్తూ.. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ఈటల. ఎంతో నమ్మిన బీఆర్ఎస్‌ నుంచి తనను గెంటేశారని.. తాను ఏ తప్పూ చేయకపోయినా మానసికంగా హింసించారని.. కేసీఆర్‌ను నమ్మినందుకు వెన్నుపోటు పొడిచారని.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ.. సెంటిమెంట్‌ పండించే ప్లాన్ చేస్తున్నారు ఈటల. గజ్వేల్ నియోజకవర్గ జనాల్లో సానుభూతి పెరిగేలా చూసుకుంటున్నారు. ఆ మధ్య కేసీఆర్‌, కేటీఆర్‌పై తీవ్రంగా మండిపడుతూ విమర్శలు గుప్పించిన ఈటల ఇప్పుడు సెంటిమెంట్‌ పండిస్తూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.

హుజురాబాద్‌లో కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు ఈటల. ఇప్పుడు గజ్వేల్‌లో అదే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి కేసీఆర్‌కు చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని చాలామంది బి‌ఆర్‌ఎస్ కార్యకర్తలతో.. ఈటల బృందం టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లంతా కూడా తనకే మద్దతు ఇచ్చేలా ఈటల స్ట్రాటజీ వర్కౌట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈటల ప్లాన్లు సక్సెస్ అయితే.. గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఝలక్‌ తగలడం పెద్ద మ్యాటర్ కాదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.