ఎవరు సీఎం అయినా ఓకే: షిండే క్లారిటీ

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్ర విజయంలో మహాయుతి చారిత్రాత్మక విజయం సాధించిందన్న ఆయన్న... నేనెప్పుడూ సామాన్యుడిగానే ఉన్నానని... సీఎంగా ఎన్నిక అవుతాను అని ఊహించలేదు అన్నారు.

  • Written By:
  • Publish Date - November 27, 2024 / 04:27 PM IST

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్ర విజయంలో మహాయుతి చారిత్రాత్మక విజయం సాధించిందన్న ఆయన్న… నేనెప్పుడూ సామాన్యుడిగానే ఉన్నానని… సీఎంగా ఎన్నిక అవుతాను అని ఊహించలేదు అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి చారిత్రాత్మక విజయం సాధించిన కొద్ది రోజుల తర్వాత షిండే మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగిసింది.

ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌కు షిండే తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఉన్నారు. అయితే తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ ను ఎంపిక చేస్తారా లేదా ఏక్‌నాథ్‌ షిండే కొనసాగుతారా? అనే దానిపై క్లారిటీ రాలేదు. ఈ తరుణంలో షిండే కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరు సిఎం అయినా సరే తనకు ఏ ఇబ్బంది లేదు అన్నారు. బిజెపికి తాము పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. తన గురించి ప్రధాని నరేంద్ర మోడికి తెలుసు అన్నారు షిండే. పేదల కష్టాలు, బాధలు నాకు తెలుసు.. బాల్‌థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్లా.. నాకు ప్రధాని మోడీ పూర్తి మద్దతు ఉంది.. మహాయుతి గెలుపు కోసం కార్యకర్తలా పనిచేశా అని చెప్పుకొచ్చారు.