ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. కీలక నిబంధనలు తెలుసుకోండి..

అభ్యర్థులు అందరూ ఎన్నికల కోడ్ పాటించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని సూచించింది.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 03:33 PM IST

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికల్లో (ASSEMBLY ELECTIONS) ఈసీ (EC) కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారికి.. కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంక్‌ పెడతారు. సహాయకుడు అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలి. తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలి. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంక్‌ పెడతారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కీలక మార్పులు చేసింది. ఇక అటు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

Teenmar Mallanna: అంతన్నావ్‌.. ఇంతన్నావ్‌.. కాంగ్రెస్‌లో చేరావ్‌.. వాటీజ్ దిస్ మల్లన్న..

అభ్యర్థులు అందరూ ఎన్నికల కోడ్ పాటించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని సూచించింది. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే స్థలం, సమయంలాంటి వివరాలను స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని చెప్పింది. కుల, మత, భాషలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. నవంబర్ 10వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా కూడా స్వీకరించడం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.

YS JAGAN: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..

పోటీలో ఉండే అభ్యర్థులు తమ క్రిమినల్ రికార్డులను లీడింగ్ న్యూస్ పేపర్స్, టీ.వీ ఛానళ్లలో పబ్లిష్ చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును స్టడీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రంలో ఇప్పటికే పర్యటిస్తోంది. అటు ఈసారి ఉదయం ఐదున్నర నుంచే పోలింగ్ ప్రారంభిస్తారు. పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చునేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. మరోవైపు పోలింగ్ శాతం పెంచే అంశంపైనా ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది.