Telangana Elections : ఆఖరివారం అత్యంత కీలకం.. అగ్రనేతలంతా తెలంగాణలోనే..

తెలంగాణలో ఎన్నికలతు దాదాపు దగ్గర పడ్డాయి. ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్‌ జరగబోతోంది. డిసెంబర్‌ 3న కొత్త ప్రభుత్వం ఏదో తెలిసిపోతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు మేనిఫెస్టో ప్రకటించి ఫుల్‌ స్పీడ్‌లో ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో ఎన్నికలతు దాదాపు దగ్గర పడ్డాయి. ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్‌ జరగబోతోంది. డిసెంబర్‌ 3న కొత్త ప్రభుత్వం ఏదో తెలిసిపోతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు మేనిఫెస్టో ప్రకటించి ఫుల్‌ స్పీడ్‌లో ప్రచారం చేస్తున్నాయి. ఎలక్షన్‌కు ఇంకా 10 రోజులే మిగిలి ఉండటంతో ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. ముఖ్యంగా నవంబర్‌ ఆఖరి వారంలో అన్ని పార్టీల అగ్ర నేతలు తెలంగాణలో మకాం వేయబోతున్నారు. ప్రధాని మోదీ సహా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నవంబర్‌ ఆఖరి వారంలో తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇప్పటికే కొన్న సభలకు హారజైన మోదీ.. ఆఖరి వారంలో తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు.

Bihar, Chat Festival : బీహార్ రాష్ట్రంలో ఛట్ పండుగ వైభవం..

ఇక కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా నవంబర్‌ చివరి వారంలో మరోసారి తెలంగాణకు రానున్నారు. పలు జిల్లాల్లో పర్యటించి ప్రచారం చేయబోతున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. రోజుకు రెండు మూడు సభల చొప్పుట సీఎం కేసీఆర్‌ ప్పటికే దాదాపు 60 శాతం స్టేట్‌ కవర్‌ చేశారు. ఈ రెండు వారాల్లో మిగిలిన జిల్లాలు కవర్‌ చేసి ప్రచారానికి ముగింపు పలకబోతున్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన కూడా ప్రచారం జోరుగానే చేస్తోంది. 8 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణకు రాబోతున్నారు. తన భ్యర్థుల నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం సాగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను కూడా జనసేన నేతలు సిద్ధం చేశారు. వారాహితో తెలంగాణలో పవన్‌ పర్యటించబోతున్నారు. ఇలా దాదాపు అన్ని పార్టీలు ఈ రెండు వారాల పాటు ప్రచారం హోరెత్తించబోతున్నాయి. మరి ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏ పార్టీని వరిస్తిందో చూడాలి.