Etela Rajender: రెంటికీ చెడ్డ రేవడిలా ఈటల.. ఇప్పుడు ఈటల భవిష్యత్‌ ఏంటి..?

కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఈటల.. హుజూరాబాద్‌లో ఛాలెంజ్ చేసి బైపోల్‌లో గెలిచారు. కేసీఆర్‌కు టఫ్ ఫైట్ ఇచ్చే నాయకుడిగా చూశారు. బీజేపీ కూడా ఈటలకు అంతే ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. ఆత్మవిశ్వాసమో.. అతివిశ్వాసమో కానీ.. ఎన్నికల వేళ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఈటల నిర్ణయించుకున్నారు.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 06:46 PM IST

Etela Rajender: తగ్గేదేలే.. అంటూ సీఎం కేసీఆర్‌పై పోటీ దిగారు బీజేపీ నేత ఈటల రాజేందర్. గజ్వేల్‌లో కమలం జెండా ఎగరేస్తానని శపథం చేశారు. చివరకు గజ్వేల్ లోనే కాదు.. హుజూరాబాద్‌లోనూ ఓడిపోయారు ఈటల రాజేందర్. ఆయన బీజేపీ తరఫున బీసీ సీఎం క్యాండేట్ అనుకుంటే.. రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి అన్నది మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఈటల.. హుజూరాబాద్‌లో ఛాలెంజ్ చేసి బైపోల్‌లో గెలిచారు. కేసీఆర్‌కు టఫ్ ఫైట్ ఇచ్చే నాయకుడిగా చూశారు.

CONGRESS: కాంగ్రెస్‌లో సస్పెన్స్‌.. సీఎం ప్రకటన ఇవాళ లేనట్టే..

బీజేపీ కూడా ఈటలకు అంతే ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. ఆత్మవిశ్వాసమో.. అతివిశ్వాసమో కానీ.. ఎన్నికల వేళ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఈటల నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌తోనే యుద్ధం.. మధ్యలో ఎవరినో అడ్డుపెట్టి కేసీఆర్‌ను కొట్టడం ఇష్టం లేదని భారీ డైలాగ్‌లు వేసి మరీ.. హుజురాబాద్‌తో‌పాటు గజ్వేల్‌లోనూ పోటీకి సై అన్నారు. ఈటల కాన్ఫిడెన్స్‌కు తోడు బీజేపీ చేసిన ప్రకటన.. రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని కమలం పార్టీ ప్రకటించడంతో.. హోప్స్ మరింత పెరిగాయ్. ఈటల రాజేందరే బీజేపీ బీసీ సీఎం క్యాండేట్ అనుకున్నారు. ఈటల కూడా తగ్గేదేలే అంటూ గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి దిగారు. హుజూరాబాద్‌లో ఈటల గెలుస్తారని ఆ పార్టీ భావించింది. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి పాడికౌశిక్ రెడ్డి చేతిలో ఈటల ఓడిపోయారు. 16,873 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అటు గజ్వేల్‌లోనూ కేసీఆర్ చేతిలో ఈటల ఓటమి పాలయ్యారు.

ఏకంగా 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇటు ఇక్కడ గెలవక.. అటు అక్కడ కూడా విజయం సాధించక.. రెండు చోట్లా ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో.. రెండుచోట్ల ఓడిపోయిన ఈటల పరిస్థితి ఏంటి..? బీజేపీ హైకమాండ్.. పార్టీలో కీలక పదవి ఇస్తుందా..? లేదంటే రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.