Etela Rajender: ఈటెలకు సొంత కారు కూడా లేదా.. ఎలక్షన్‌ అఫిడవిట్‌లో ఇంట్రెస్టింగ్‌ విషయాలు..

ఎన్నో ఏళ్ల నుంచి పౌల్ట్రీ బిజినెస్‌ చేస్తున్నారు ఈటెల రాజేందర్‌. కింది స్థాయి నుంచి వచ్చిన ఈటెల రాజేందర్‌ వ్యాపారంలో బాగా సంపాదించి కోట్లకు అధిపతి అయ్యారు.

  • Written By:
  • Publish Date - November 18, 2023 / 07:27 PM IST

Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక నేత ఈటెల రాజేందర్‌. కేసీఆర్‌ కుటుంబం తరువాత ఆ స్థాయి ఆదరణ ప్రజల్లో సంపాదించుకున్న వ్యక్తి. కేవలం రాజకీయాల్లోనే కాదు.. వ్యాపారంలో కూడా ఈటెలకు తిరుగు లేదు. ఎన్నో ఏళ్ల నుంచి పౌల్ట్రీ బిజినెస్‌ చేస్తున్నారు ఈటెల రాజేందర్‌. కింది స్థాయి నుంచి వచ్చిన ఈటెల రాజేందర్‌ వ్యాపారంలో బాగా సంపాదించి కోట్లకు అధిపతి అయ్యారు. రీసెంట్‌గా ఎన్నికల సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌ రూపంలో ఎన్నికల అధికారులకు సమర్పించారు ఈటెల రాజేందర్‌. ఈ అఫిడవిట్ ప్రకారం..ఈటల రాజేందర్ పేరు మీద 6 కోట్ల 74 లక్షల 473 రూపాయల ఆస్తి ఉంది.

MLA JEEVANREDDY: ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..

ఈటల రాజేందర్ సతీమణి జమున పేరు మీద షేర్స్, బాండ్స్, వాహనాలు, పర్సనల్ అడ్వాన్స్ కలిపి మొత్తం 26 కోట్ల 48 లక్షల 70 వేల 394 రూపాయలు విలువ చేసే చరాస్థులు ఉన్నాయని అధికారంగా వెల్లడించారు ఈటెల. ఇక ఈటల రాజేందర్ దగ్గర ప్రస్తుతం లక్ష రూపాయల నగదు మాత్రమే ఉందట. అటు ఈటల సతీమణి జమున చేతిలో కేవలం లక్షన్నర నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈటల రాజేందర్ స్థిరాస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం 12 కోట్ల 50 లక్షలు ఉన్నాయి. ఈ అఫిడవిట్‌ మొత్తంలో అన్నిటికంటే ఆసక్తికర విషయం.. ఈటెల పేరు మీద కారు కూడా లేకపోవడం.

అవును.. ఈటెల ఇచ్చిన అఫిడివిట్‌ ప్రకారం ఆయనకు సొంత కారు కూడా లేదు. అయితే ఈటల రాజేందర్ భార్య జమున పేరిట మూడు ఇన్నోవా, ఒక సీఆర్వీ, ఒక క్రిస్ట ఉన్నాయి. వీటితో పాటు ఒకటిన్నర కేజీల బంగారం జమున పేరమీద ఉంది. ఇక జమున హ్యాచరీస్‌తో పాటు అభయ డెవలపర్స్, నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్, ఎష్వీఎస్ అర్చవాన్ అండ్ డొలరైట్ అనే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్‌ పేరు మీద కనీసం కారు కూడా లేకపోవడం ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది.