ఉత్తుత్తి బ్యాంక్‌ ఇది మామూలు మోసం కాదు

నకిలీ సిమ్‌ కార్డులు, నకిలీ ఆఫర్లు, నకిలీ సామాన్లు ఇలా ఇప్పటికే చాలా మోసాలు చూశాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే మోసం మాత్రం వేరే లెవెల్‌. సామాన్యులను మోసం చేసి డబ్బు దొబ్బేసేందుకు ఏకంగా నకిలీ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు కొందరు కేటుగాళ్లు.

  • Written By:
  • Publish Date - October 11, 2024 / 12:29 PM IST

నకిలీ సిమ్‌ కార్డులు, నకిలీ ఆఫర్లు, నకిలీ సామాన్లు ఇలా ఇప్పటికే చాలా మోసాలు చూశాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే మోసం మాత్రం వేరే లెవెల్‌. సామాన్యులను మోసం చేసి డబ్బు దొబ్బేసేందుకు ఏకంగా నకిలీ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు కొందరు కేటుగాళ్లు. ఒకటి రెండు రోజులు కాదు.. దాదాపు నెల రోజుల నుంచి ఈ బ్యాంక్‌ను నడుతుపుతున్నారు. ఛతీస్‌ఘడ్‌లోని మల్కరౌడా పోలీస్ స్టేషన్ పరిధిలోని చాపోరా అనే విలేజ్‌ ఉంది. కొందరు బ్యాంక్‌ సిబ్బంది వచ్చి ఓ బిల్డింగ్‌ రెంట్‌కు తీసుకున్నారు. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్‌ బ్రాంచ్‌ రాబోతోదంటూ చెప్పి అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని ఎస్బీఐ బ్రాంచీల్లో ఉన్నట్టుగానే సామాన్లు ఏర్పాటు చేశారు. లాకర్లు, క్యాబిన్‌లు ఏర్పాటు చేసి నిజమైన ఎస్బీఐ బ్యాంక్‌కంటే బ్యూటిఫుల్‌గా ఇంటీరియర్‌ డిజైన్‌ చేశారు. అయితే వీళ్ల టార్గెట్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయించి డబ్బులు కొట్టేయడం కాదు. బ్యాంక్‌ ఉద్యోగాల పేరుతో దోచుకోవడం.

డబ్బులిస్తే బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లోకల్‌ యూత్‌ను నమ్మించారు. సెటప్‌ అంతా పర్‌ఫెక్ట్‌గా ఉండటంతో అంతా చాలా ఈజీగా వాళ్లను నమ్మేశారు. బ్యాంక్‌లో ఉద్యోగం అది కూడా సొంతూరిలో అని తెలియడంతో ముందూ వెనకా ఆలోచించకుండా డబ్బు సమకూర్చి వాళ్లకు ముట్టజెప్పారు. అలా డబ్బు ఇచ్చిన కొందరు వ్యక్తులకు తన ఉత్తిత్తి బ్యాంక్‌లో కొన్ని రోజులు ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. కానీ అన్ని ఉద్యోగాలు ఇలా బ్యాక్‌డోర్‌ నుంచి తీసుకోరు కదా అని అనుమానించిన కొందరు గ్రామస్థులు వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీన్‌లో ఎంటర్‌ అవడంతో వీళ్ల నకిలీ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. బ్యాంక్‌ పేరుతో వాళ్ల చేసిన దందా బయటకు వచ్చింది. సీఎం మొత్తం బ్యాంక్‌ సామాగ్రిని సీజ్‌ చేశారు. ట్రైనింగ్‌ ఇచ్చేందుకు వాళ్లు రెక్రూట్‌ చేసుకున్న సిబ్బందిని కూడా అరెస్ట్‌ చేశారు. వీళ్లు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. వీళ్ల నుంచి మొత్తం ముఠా వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.