జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… ప్రస్తుత రాజకీయాల్లో ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న వ్యక్తి మరొకరు లేరు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నప్పుడు వచ్చిన ఫాలోయింగ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం మరింతగా పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాధించిన విజయం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కావడం చూసి… విమర్శించిన వాళ్ళు కూడా కొనియాడటం మొదలుపెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాల విషయంలో దూకుడు ప్రదర్శించడం చూసి ఆయన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
సాధారణంగా సాయం విషయంలో పవన్ ది పెద్ద చేయి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ముందు నుంచి కూడా సాయం చేస్తూనే ఉంటాడు పవన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ సాయం ఎక్కువైంది. గతంలో కంటే ఇప్పుడు మితి మీరింది అనే కామెంట్స్ వస్తున్నాయి. విజయవాడ వరదల సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆయన ఆరు కోట్ల రూపాయలు సాయం చేసారు. దీనితో అందరూ కంగుతిన్నారు. ముందు కోటి తర్వాత 5 కోట్ల రూపాయలు పవన్ సాయం చేయడం చూసి విమర్శకులు కూడా షాక్ అయ్యారు.
ఇక ఆ తర్వాత కూడా ఆయన సాయం ఆగలేదు. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర భక్తుల కోసం వంద గదులతో పవన్ కళ్యాణ్ ఓ భవనం నిర్మిస్తున్నారు. దానికి కూడా భారీగానే ఖర్చు అవుతోంది. అలాగే… తాజాగా ఓ స్కూల్ కోసం ఎకరం పొలం కొని వాళ్లకు ప్లే గ్రౌండ్ గా ఇచ్చారు. దాని ఖరీదు దాదాపు 60 లక్షల రూపాయలు. దీనిపై ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా విమర్శలు చేయడం గమనార్హం. సహాయం చేయవచ్చు గాని దానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది అని కామెంట్స్ చేస్తూ పలు మీమ్స్ ని వైరల్ చేస్తున్నారు.
అకీరా, ఆధ్యా, అంజనీ, మార్క్ అందరూ కూడా ఏదోక ఉద్యోగం చేసుకుని బ్రతకాల్సిందే అని, బాగా చదువుకోవాలి అంటూ పవన్ ఫ్యాన్స్ వాళ్ళ ఫొటోస్ తో ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. అకీరా కూడా సినిమాల్లోకి వచ్చి త్వరగా సంపాదించుకుని దాచుకోవాలని వాళ్ళ నాన్నను ఫాలో అయితే చేతికి చిప్పే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే సాయం చేస్తూ పోతే… పవన్ పరిస్థితి గురించి ఓ ఫన్నీ మీమ్ వైరల్ చేసారు. బెండు అప్పారావు ఆర్ఎంపీ సినిమాలో ఆహుతి ప్రసాద్ లా అడిగిన వాడికి అడగని వాడికి పెడుతూ ఉంటారని… ఆ సినిమాలో ఓ పెద్ద మనిషి ఆహుతీ ప్రసాద్ గారి ఇంటికి వచ్చి భోజనం అడుక్కుంటాడు అని అలా పవన్ పరిస్థితి మారిపోతుందని కొంచెం పిల్లలకు ఆస్తి మిగల్చాలి అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.