కేటిఆర్ లో అరెస్ట్ భయం…? ట్వీట్ అందుకేనా…?

తెలంగాణా రాజకీయాల్లో కార్చిచ్చు అంటుకుందా...? ఇప్పటి వరకు విమర్శలకు, లీగల్ నోటీసులకు పరిమితం అయిన రాజకీయం ఇప్పుడు అరెస్ట్ ల వరకు వెళ్లేందుకు గ్రౌండ్ వర్క్ రెడీ అయిందా...? జన్వాడ ఫాం హౌస్ లో జరిగిన పార్టీ దేనికి సంకేతం...?

  • Written By:
  • Publish Date - October 29, 2024 / 05:54 PM IST

తెలంగాణా రాజకీయాల్లో కార్చిచ్చు అంటుకుందా…? ఇప్పటి వరకు విమర్శలకు, లీగల్ నోటీసులకు పరిమితం అయిన రాజకీయం ఇప్పుడు అరెస్ట్ ల వరకు వెళ్లేందుకు గ్రౌండ్ వర్క్ రెడీ అయిందా…? జన్వాడ ఫాం హౌస్ లో జరిగిన పార్టీ దేనికి సంకేతం…? ఉన్న పళంగా హైదరాబాద్ లో 144 సెక్షన్ ఎందుకు అమలు జరుగుతోంది…? పొలిటికల్ బాంబులు… తుస్సు బాంబులు కాదా…? అణుబాంబులను కాంగ్రెస్ సర్కార్ సిద్దం చేసిందా…? అంటే అవుననే అవుననే సమాధానాలే వినపడుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ట్వీట్ చూస్తే ఎన్నో అనుమానాలు నిజమే అనే డౌట్ స్టార్ట్ అవుతోంది.

“తెలంగాణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ సీఎం తమ వైఫల్యాలను, అవినీతిని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బయటపెట్టడంతో తీవ్ర నిరాశలో ఉండి ఇప్పుడు విసిగిపోయారు. బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా యోధులు అందరికీ ధన్యవాదాలు. గత రెండు రోజులుగా మనం చూసింది రాజకీయ ప్రతీకార యుద్ధానికి నాంది మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని పరీక్షలు మరియు కష్టాలు ఎదురు అవుతాయి. దుర్మార్గపు వ్యక్తిగత దాడులు, కుట్రలు, బూటకపు ప్రచారాలు, వాస్తవాల పేరుతో అబద్దాలను ప్రచారం చేస్తారు. వాటిని మనం సమర్ధవంతంగా ఎదుర్కొందాం.

కేసులు నమోదు చేయడాన్ని, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం, పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చాలా అసత్యాలను ప్రచారం చేయడం మీరు చూడబోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ & వారి పెయిడ్ సోషల్ మీడియా టీంలు దాదాపుగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసాయి. వారి చర్యలు చూసి మనం ఆశ్చర్యపోవద్దు, గందరగోళ పడవద్దు… వాటిని చూసి మీ టార్గెట్ ను మిస్ కావొద్దు. తెలంగాణ ప్రజల కోసం జరిగే మంచి పోరాటంపై దృష్టి పెడదాం. వారి అవినీతి, అసమర్థత, బయటపెట్టడంలో దృఢ నిశ్చయంతో ఉందాం. వారి 6 హామీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైనందుకు వారిని ప్రజల్లో దోషులుగా నిలబెడదాం.”

అంటూ కేటిఆర్ ఎక్స్ లో పోస్ట్ చేసారు. జన్వాడ ఫాం హౌస్ తర్వాత కేటిఆర్ పైనే చాలా డౌట్స్ మొదలయ్యాయి. మీడియా సమావేశంలో కేటిఆర్ చేసిన కామెంట్స్ కు వాస్తవానికి చాలా తేడాలు ఉన్నాయని, సీసీటీవీ ఫూటేజ్, డ్రగ్స్ టెస్ట్, రాజ్ పాకాల పారిపోవడం వీటి గురించి కేటిఆర్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ కేసులో విజయ్ మద్దూరి ఫోన్ పోలీసులకు ఇవ్వకుండా ఓ మహిళ ఫోన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫోన్ పోలీసులకు దొరికితే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు అనే సంకేతాలు ఉన్నాయి. జన్వాడ ఫాం హౌస్ విషయంలో యేవో విషయాలను బయటపెట్టే ఛాన్స్ ఉందని కేటిఆర్ అందుకే అలెర్ట్ అయి ఉండవచ్చు అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జస్టీస్ ఘోష్ విచారణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ విచారణలో కీలక అంశాలను ఘోష్ కమీషన్ సేకరించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు… పాస్పోర్ట్ ను రద్దు చేసారు. దీనితో వారిని ఏ క్షణం అయినా అమెరికా నుంచి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కేటిఆర్ ను కలవరపెడుతున్నాయని ఒపీనియన్ వినపడుతోంది. పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబుల ఒత్తికి ఆల్రేడి అగ్గి పెట్టారని త్వరలోనే అవి అణుబాంబులుగా పేలే అవకాశం ఉందని టాక్. అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియాను కేటిఆర్ అలెర్ట్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది. కేటిఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయవచ్చని, మరో బీఆర్ఎస్ కీలక నేతను కూడా జైలుకు తరలించే ఛాన్స్ ఉండవచ్చని సమాచారం. పొలిటికల్ లీడర్స్ అరెస్ట్ లు ఉండటంతోనే హైదరాబాద్ లో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు జరుగుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.