G20 Summit 2023: జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశాధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు చేసింది. 19 దేశాల అధ్యక్షులు, యూరోపియన్ యూనియన్ కూటమిలోని 27 దేశాల ప్రెసిడెంట్లు, ప్రతినిధులతో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు జీ20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నారు. సుమారు 10 వేల మంది విదేశీ అతిథులు రానుండటంతో సెక్యూరిటీ విషయంలో భారత్ ఎక్కడా కాంప్రమైజ్ కావడంలేదు.
రెండు రోజులు జరగబోయే ఈ సమ్మిట్‌కు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ మొత్తం ఇంచ్ బై ఇంచ్ ఇప్పుడు కమాండోస్ కంట్రోల్‌లో ఉంది. చీమ చిటుక్కుమన్నా లేపేసేందుకు స్పెషల్ లేడీ స్నైపర్లను కూడా రంగంలోకి దింపారు. 10 వేల మందికి సెక్యూరిటీ ఇచ్చేందుకు జస్ట్ 19 మందిని మాత్రమే దింపారు అంటే వాళ్లు ఎంత షార్ప్ షూటర్స్ అనేది అర్థం చేసుకోండి. జీ20 సమ్మిట్ సెక్యూరిటీ కోసం చాలా కాలంగా వీళ్లను ట్రైన్ చేస్తున్నారు. వీళ్లు ఎక్కడ ఉంటారు.. ఎలా ఎటాక్ చేస్తారు.. అనే విషయాలు ఎవరికీ తెలియవు. కాస్త అనుమానస్పదంగా సీన్ కనిపిస్తే చాలు.. టార్గెట్‌ను లేపేయడమే వీళ్ల పని. స్థిరంగా ఓ స్థానం అని కాకుండా అతిథులు తిరిగే ప్రాంతాల్లో వీళ్లు హైడ్ అవుతారు. ఇప్పటికే అతిథులు తిరిగే ప్రాంతాల్లో ప్రయాణికుల రాకపోకలు నిషేదించారు. 100కు పైగా రైళ్లు రద్దు చేశారు.
ఎమర్జెన్సీ మెడిసిన్ తప్ప ఏదీ డెలివెరీ చేయడానికి కూడా ఈ రెండు రోజులు పర్మిషన్ లేదు. సెంట్రల్ ఢిల్లీ ఏరియా మొత్తాన్ని హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ గగనతలంపై ఏ అనుమానాస్పద వస్తువు కనిపించినా సరే కూల్చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ సమావేశాల కోసం 1 లక్షా 40 వేల మంది సెక్యూరిటీ సిబ్బందితో సహా 80వేల మంది ఢిల్లీ పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. 23 ఇంటర్నేషనల్ హోటళ్లలో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ప్రతినిధులకు బస ఏర్పాటు చేశారు. సమ్మిట్ జరిగే కనుచూపుమేర అంతా సెక్యూరిటీ కంట్రోల్‌లో ఉంటుంది.