Parliament Elections : ఆ రెండు ఎంపీ సీట్లకు తీవ్ర పోటీ..!

తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తర్వాత ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. రాష్ట్రంలో ఈసారి మల్కాజ్ గిరి, చేవెళ్ళ ఎంపీ స్థానాలు హాట్ సీట్లుగా మారబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మహా మహులు ఈ సీట్లను దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ రెండు స్థానాల్లో గెలుపు లక్ష్యంగా భావిస్తున్నాయి. దాంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు.

 

తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తర్వాత ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. రాష్ట్రంలో ఈసారి మల్కాజ్ గిరి, చేవెళ్ళ ఎంపీ స్థానాలు హాట్ సీట్లుగా మారబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మహా మహులు ఈ సీట్లను దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ రెండు స్థానాల్లో గెలుపు లక్ష్యంగా భావిస్తున్నాయి. దాంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు.

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాయి. తెలంగాణలో 17పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పటికీ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మల్కాజ్ గిరి, చేవెళ్ళపైనే అందరి ఫోకస్ కనిపిస్తోంది. హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉన్న ఈ రెండు స్థానాలను దక్కించుకోవడం అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారింది. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరికి మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆయన సీఎం అయ్యాక రిజైన్ చేశారు. సో ఆ సీటు కాపాడుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి ఈ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు. మల్కాజ్ గిరి, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలవగా.. 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీకి కూడా ఒక్కసీటు రాకపోయినా.. నాలుగు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది.

మల్కాజ్ గిరికి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు కాబట్టి.. ఈసారి కూడా ఆ సీటను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అలాగే గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయిన చేవెళ్ళ కూడా గెలవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిన మైనంపల్లి హన్మంతరావు.. ఈసారి ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ తరపున కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మహేశ్వరం నుంచి పోటీకి ఆయన మొదట ఒప్పుకోలేదు. దాంతో కాంగ్రెస్ పెద్దలు.. ఎంపీ స్థానం లేదా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ప్రపోజ్ చేసినట్టు చెబుతున్నారు.

హైదరాబాద్ సిటీ పరిధిలో మొత్తం అసెంబ్లీ సీట్లన్నీ బీఆర్ఎస్ గెలుచుకోవడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని BRS కార్పొరేటర్లతో సమావేశమైన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయడానికి కలసికట్టుగా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తెద్దామనీ.. హైదరాబాద్ లో సమస్యలపైనా నిలదీద్దామని కేటీఆర్ కార్పొరేటర్లకు సూచించారు. అంటే చేవెళ్ళ, మల్కాజ్ గిరి లోక్ సభ సీట్లను గెలుచుకునేందుకు BRSముందుగానే ప్లాన్స్ మొదలు పెట్టింది. చేవెళ్ళకు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి సబిత కొడుకు కార్తీక్ రెడ్డి రేసులో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితం అయినప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ చూస్తోంది. అవసరమతే ప్రధాని నరేంద్రమోడీని మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ నుంచి రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి కమలం పార్టీ నేతలు విన్నవించినట్టు సమాచారం. మోడీ పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ తెలంగాణలోని మిగతా స్థానాలపైనా పడుతుందని అంటున్నారు. చేవెళ్ళ ఎంపీ స్థానానికి బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. మల్కాజ్ గిరికి బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావుతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీలో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికి అధిష్టానం ఆశీస్సులు ఉంటాయన్నది చూడాలి.