FILES MISSING: తెలంగాణలో మాయమవుతున్న ఫైల్స్.. పశుసంవర్థక శాఖలో ఫైల్స్ చోరీ.

హైదరాబాద్, మాసబ్‌ట్యాంకులో ఉన్న పశుసంవర్థక శాఖకు సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు కనిపించడం లేదు. ఈ శాఖకు సంబంధించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీసులో కీలకమైన ఫైళ్లు మాయం అయినట్లు అధికారులు గుర్తించారు

  • Written By:
  • Updated On - December 9, 2023 / 08:33 PM IST

FILES MISSING: తెలంగాణలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. పాత ప్రభుత్వానికి సంబంధించిన కీలకఫైల్స్ మాయమవుతున్నాయి. సెక్రటేరియట్ నుంచి కొన్ని కీలక ఫైల్స్ మాయమైనట్లు ఇటీవల ప్రచారం జరగగా.. తాజాగా పశుసంవర్థక శాఖలో ఫైల్స్ చోరీకి గురికావడం సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్, మాసబ్‌ట్యాంకులో ఉన్న పశుసంవర్థక శాఖకు సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు కనిపించడం లేదు. ఈ శాఖకు సంబంధించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీసులో కీలకమైన ఫైళ్లు మాయం అయినట్లు అధికారులు గుర్తించారు.

Uttam Kumar Reddy: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడైనా గెడ్డం తీస్తారా

ఈ అంశంపై అధికారులు, అక్కడి వాచ్‌మన్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలసాని ఓఎస్డీ కల్యాణ్‌పై కేసు నమోదు చేశారు. ఐదు సెక్షన్ల కింద కల్యాణ్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆపరేటర్స్ మోహన్, వెంకటేష్, ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. వీళ్లు ఆఫీసు నుంచి ఫైళ్ళను ఎత్తుకెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఆఫీసులో ఫైళ్ళను ధ్వంసం చేసినట్టు ఆనవాళ్లు గుర్తించారు. మిగతా ఫైల్స్ చిందరగా పడేసి ఉన్నాయి. అలాగే సీసీ కెమెరాలను కూడా పగలగొట్టారు. ఆఫీసు నుంచి ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్ళినట్టు తెలిసింది. ఈ కేసుపై సెంట్రల్ జోన్ DCP శ్రీనివాస్ ఆధారాలు సేకరించి, విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణ ఇలా సాగుతుండగానే విద్యాశాఖలో ఫైల్స్‌ చోరీకి యత్నం విద్యా పరిశోధనా శిక్షణ సంస్థలో ఫైల్స్‌ చోరీకి యత్నించడం సంచలనం కలిగించింది.

శనివారం సాయంత్రం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో కొందరు దుండగలు ఇక్కడి ఫైల్స్‌‌ను ఆటోలో ఎత్తుకెళ్లేందుకుప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు దుండగులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని, అధికారులు రావడంతో దుండగులు అక్కడి నుం పరారయ్యారు. ఆటోతో సహా ఫైల్స్‌ వదిలేసి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.