జత్వానీ ఐఫోన్ కోసం, ఐపిఎస్ అధికారులు దారుణం…!

ఆంధ్రప్రదేశ్ లో ముంబై హీరోయిన్ జత్వాని వేధించిన కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెపై మరో అక్రమ కేసు బనాయించారు అని విచారణలో వెల్లడి అయింది.

  • Written By:
  • Publish Date - September 30, 2024 / 10:38 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ముంబై హీరోయిన్ జత్వాని వేధించిన కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెపై మరో అక్రమ కేసు బనాయించారు అని విచారణలో వెల్లడి అయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో… నాలుగు రోజుల పాటు కోర్ట్ జత్వానికి ఆమె కుటుంబ సభ్యులకు పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వగా ఈ నాలుగు రోజుల్లో ఆమె ఐఫోన్ ఓపెన్ చేసేందుకు విజయవాడ పోలీసులు తీవ్రంగా కష్టపడినట్టు విచారణలో వెల్లడి అయింది.

ఐపిఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఐఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు నానా కష్టాలు పడ్డారట. ఈ నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఉన్న ఆమెను… ఫోన్ ఓపెన్ చేయాలని కాంతిరాణా, విశాల్ గున్నీ తీవ్రంగా ఒత్తిడి చేసారట. అయితే తన ఫోన్ ఓపెన్ చేసేందుకు ఆమె నో చెప్పారు. దీనితో ఢిల్లీలో ఉన్న ఆమె సన్నిహితుడు అమిత్ కుమార్ సింగ్ ఓపెన్ చేస్తారని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చెప్పారట.

దీనితో పోలీసులు ఇక్కడ మరో స్టెప్ వేసారు. ఫిబ్రవరి 10న విజయవాడలోని పటమట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ స్పా సెంటర్ మీద దాడి చేసారు. ఈ దాడిలో దొరికిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళను ఏ 1 గా చేర్చి అదే కేసులో ఆమిత్ కుమార్ ను ఏ 2 చేసి.. అతను దిల్లీ నుంచి ఇక్కడకు మహిళలను సరఫరా చేస్తున్నారని కేసు నమోదు చేసారు. కేసును అడ్డుపెట్టుకుని అమిత్ కోసం నలుగురు సభ్యులు… ఢిల్లీ వెళ్ళారు. వీరికి సీపీ ఆఫీస్ నుంచే టికెట్ లు బుక్ చేసారు. ఢిల్లీ వెళ్ళినా అక్కడ అతని ఆచూకీ లేకపోవడంతో తిరిగి వచ్చేశారు. ఈ లోపు జత్వానీ కస్టడీ ముగిసింది. మరి దీనిపై ఏ అడుగులు పడతాయో చూడాలి.