కాంగ్రెస్‌కు అధికారం తప్ప వేరే యావ లేదని.. ఎవరికీ చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటారని.. అందుకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరానంటూ కామెంట్ చేశారు. ఆయనను బీజేపీలోకి తీసుకు వచ్చింది ఎవరు.. కిరణ్ కుమార్ సేవలు తెలంగాణకా, ఏపీకా అనే సంగతి పక్కనపెడితే.. కమలం పార్టీ కండువా కప్పుకోవడం.. పొలిటికల్ కెరీర్‌కు ఎండ్‌కార్డు వేసుకున్నట్లే అనే చర్చ నడుస్తోందిప్పుడు జనాల్లో ! మాజీ ముఖ్యమంత్రి, ఏపీ రాజకీయాల్లో కీలక నేత, కాంగ్రెస్‌లో కీ లీడర్.. పార్టీలో చేరుతున్నారన్న హడావుడి బీజేపీలో ఏ మాత్రం కనిపించలేదు.
ఆయన కాషాయ కండువా ఎందుకు కప్పుకున్నారన్న సంగతి పక్కనపెడితే.. కిరణ్ కుమార్ చేరిక కార్యక్రమంలో ఏపీ బీజేపీ నేతలెవరూ పాల్గొనలేదు. ఏపీ పీసీసీ చీఫ్ సోము వీర్రాజు కూడా దూరంగానే ఉండిపోయారు. ఏపీ బీజేపీ తరఫున దిగ్గజాలుగా వ్యవహరిస్తున్న జీవీఎల్, పురందేశ్వరి సహా ఎవరూ కనిపించలేదు. రాష్ట్ర స్థాయి నేతలు బిజీగా ఉన్నారనుకోవచ్చు.. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయన కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీలో చేరుతున్నారు అంటే.. ఢిల్లీ పెద్దలు అయినా ఆసక్తి చూపించాలి కదా.. అదీ జరగలేదు ! మోదీ రాలేదు.. నంబర్ టు అమిషా కనిపించలేదు.. చివరికి పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా కూడా పట్టించుకున్నట్లు కనిపించలేదు.
ప్రహ్లాద్ జోషి కండువా కప్పి.. కిరణ్‌కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. బీజేపీలో కిరణ్‌కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ఏపీ బీజేపీలోనే మాములుగానే మూడు గ్రూప్‌లు ఉంటాయ్. ఒకటి టీడీపీకి అనుకూలం.. మరొకటి వైసీపీకి ఫేవర్.. ఇంకొకకటి అసలు బీజేపీ గ్రూప్. ఇప్పుడు కిరణ్ చేరికతో మరో గ్రూప్ మొదలుకావడం ఖాయం.
అసలే బలం లేని పార్టీలో ఈ గ్రూప్‌ల కొట్లాట మొదలైతే.. అడుగు పడడం, అది ప్రయాణంగా మారడం కష్టమే ! ఇదంతా ఎలా ఉన్నా.. కిరణ్‌కుమార్‌రెడ్డికి బీజేపీ హైకమాండ్ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని క్లియర్‌గా అర్థం అవుతోంది. దీంతో బీజేపీలో ఇప్పటికిప్పుడు కిరణ్ పదవులు ఆశించడం అంటే.. అత్యాశే అవుతుంది మరి ! పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండాలని, చక్రం తిప్పాలని.. కిరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు బీజేపీకి చేరుకున్నారు. ఇక్కడే పొలిటికల్‌గా చివరి ఇన్నింగ్స్ కనిపించడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.