తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది అన్నట్టు.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తున్న ప్లాన్లన్నీ.. రివర్స్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి. అలాంటి హామీ లేవీ కర్ణాకటలో అమలు కాలేదంటూ.. కౌంటర్స్ ఇస్తోంది గులాబీ పార్టీ. కానీ అవన్నీ బూమరాంగ్ అవుతుండటంతో ఏం చేయాలో తెలియడం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు ఇక్కడి కాంగ్రెస్ లీడర్లు తిప్పికొడుతున్నారు.
కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి బెంగళూరులో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణలో సంచలనంగా మారింది. అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన ఫైవ్ గ్యారంటీస్ అమలు కావట్లేదని ఆయన ఆరోపించారు. అంతేకాదు 5 గంటలు కూడా పవర్ సప్లయ్ కావడం లేదన్నారు కుమార స్వామి. అదే టైమ్ లో ఇక్కడ గాంధీ భవన్ లో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ లీడర్ నాజిర్ హుస్సేన్ వెంటనే రియాక్ట్ అయ్యారు. బీజేపీ తో ఫ్రెండ్షిప్ చేస్తున్న జేడీఎస్ నుంచి ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని తిప్పికొట్టారు. కాంగ్రెస్ ను కార్నర్ చేయడం తప్ప.. వాస్తవాలు చూడలేకపోతున్నారని అన్నారు. కుమారస్వామి కామెంట్స్ ని ప్రెస్ మీట్ పెట్టి తిప్పికొట్టారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడి ఫ్రెండ్ కుమారస్వామితో తప్పుడు స్టేట్ మెంట్స్ ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ని కేసీఆరే రంగంలోకి దింపారన్నారు. అంతేకాదు.. ఈ ప్రెస్ మీట్ టెలికాస్ట్ చేయమని మీడియాకు హరీష్ రావు మెస్సేజ్ లు పెట్టారని కూడా ఆరోపించారు. ఈ ఇష్యూలో BRS కు అనుకున్న స్థాయిలో మైలేజ్ మాత్రం రాలేదు.
Nampally Fire Accident : నాంపల్లి లోని డీజిల్ గ్యారేజ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.
అంతకుముందు ఫాక్స్ కాన్ యూనిట్ ను తెలంగాణకు రాకుండా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు మంత్రి కేటీఆర్. ఓ లెటర్ కూడా తీసుకొచ్చి మీడియాకు చూపించారు. కానీ అది బోగస్ లెటర్ అనీ.. ఫేక్ లెటర్ తో కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుతున్నారని డీకే శివకుమార్ మండిపడ్డారు. ఈ ఫేక్ లెటర్ పై దర్యాప్తు చేయాలంటూ శివకుమార్ కర్ణాటక సైబర్ క్రైమ్ సెల్ కి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇది కూడా బూమరాంగ్ అయింది.
ఇవన్నీ జరక్క ముందు.. కొంతమంది కర్ణాటక రైతులు కొడంగల్ లో నిరసన ప్రదర్శనలు చేశారు. కన్నడ నాట కరెంట్ లేదు.. హామీలు అమలు కావడం లేదంటూ రైతులు నిరసన చేశారు. ఆ తర్వాత వాళ్ళల్లో కొందరు తమకు డబ్బులు ఇస్తే.. ఇక్కడికొచ్చి నిరసన తెలిపామని మీడియాకు చెప్పారు. ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టింది. ఇదే కాకుండా రైతు బంధు ఆపాలంటూ.. ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ లెటర్ రాసిందని సీఎం కేసీఆర్ స్వయంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే అలాంటి లెటర్ ఏదీ కాంగ్రెస్ నుంచి తమకు రాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఆ వ్యూహం కూడా BRSకు కలసి రాలేదు. కర్ణాటకను చూపించి.. తెలంగాణలో కాంగ్రెస్ ను బద్నాం చేయడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. కొడంగల్ రైతుల నిరసన దగ్గర నుంచి ఆదివారం జరిగిన కుమార స్వామి ప్రెస్ మీట్ దాకా అన్నీ గులాబీ పార్టీకి బూమరాంగ్ అవుతున్నాయి.